AP Inter Results: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్‌.. రిజల్ట్స్‌ తేదీపై అధికారిక ప్రకటన వచ్చేసింది

|

Apr 25, 2023 | 6:50 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌ పరీక్షలు రాసిన విద్యార్థులకు అలర్ట్‌. పరీక్షల ఫలితాల విడుదల తేదీ వచ్చేసింది. మార్చి నెలలో జరిగిన ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్, సెకండర్‌ పరీక్షా ఫలితాలను ఏప్రిల్‌ 26వ తేదీన విడుదల చేయనున్నారు. ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సాయంత్రం...

AP Inter Results: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్‌.. రిజల్ట్స్‌ తేదీపై అధికారిక ప్రకటన వచ్చేసింది
AP Inter Results
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌ పరీక్షలు రాసిన విద్యార్థులకు అలర్ట్‌. పరీక్షల ఫలితాల విడుదల తేదీ వచ్చేసింది. మార్చి నెలలో జరిగిన ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్, సెకండర్‌ పరీక్షా ఫలితాలను ఏప్రిల్‌ 26వ (బుధవారం) తేదీన విడుదల చేయనున్నారు. ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం సాయంత్రం 5 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాల విడుదల అనంతరం విద్యార్థులు తమ రిజల్ట్స్‌ను https://exmaresults.ap.nic.in లేదా www.bie.ap.gov.in వెబ్ సైట్స్ లో చెక్ చేసుకోవచ్చు.

రేపు ఇంటర్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ అధికారికంగా ప్రకటించింది. ఇదిలా ఉంటే ఈఏడాది ఇంటర్ సెకండ్ ఇయర్ 5.19 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారు. మొదటి సంవత్సరానికి చెందిన 4.84 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. మార్చి 15న మొదలైన ఇంటర్‌ పరీక్షలు ఏప్రిల్‌ 4న ముగిశాయి.