Dwaraka District: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు చిక్కుముడిగా మారుతోంది. రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో పలు ప్రాంతాల్లో కొత్త సమస్యలు తెరపైకి వచ్చి వివాదాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాను రెండు జిల్లాలుగా విభజించారని వారు తెలిపారు. ఒకటి ఏలూరు జిల్లా కేంద్రంగా ఏలూరు జిల్లా, మరొకటి భీమవరం కేంద్రంగా నరసాపురం జిల్లాగా ప్రణాళికలు రూపొందిస్తున్నారని సమాచారం. అయితే ఏలూరు జిల్లా పేరును ద్వారకగా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు స్థానిక ప్రజలు, టీడీపీ నేతలు. ద్వారకాతిరుమల అంబేద్కర్ సెంటర్‌లో తలనీలాలు ఇచ్చి టీడీపీ నేతలు నిరసన తెలిపారు. ప్రజలు కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు.
Also read:
Jr NTR : ఎన్టీఆర్ కొరటాల సినిమానుంచి రెండు భారీ ఆప్డేట్స్ రానున్నాయి.. అభిమానులకు పండగే
ICSIL Jobs: మహిళకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతో కేవలం ఇంటర్వ్యూ ఆధారంగానే!
AP Politics: మరో YSRCP ఎమ్మెల్యేపై స్థానిక నేతల తిరుగుబాటు బావుటా.. అనంతలో వేడెక్కిన రాజకీయం