Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు వైద్య పరీక్షలు..

పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషిస్తున్నందున, ఆయన ఆరోగ్య పరిస్థితిపై అందరి దృష్టి ఉంది. బడ్జెట్ సమావేశాల్లో ఆయన పాల్గొంటారని జనసేన పార్టీ కార్యాలయం ప్రకటించడం ఆయన అభిమానులకు కొంత ఊరట. పవన్ కళ్యాణ్ ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు వైద్య పరీక్షలు..
Pawan Kalyan In Apollo

Edited By: Balaraju Goud

Updated on: Feb 22, 2025 | 11:34 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా, స్కానింగ్, సంబంధిత పరీక్షలు నిర్వహించగా, వైద్యులు కొన్ని సూచనలు చేశారు. మరికొన్ని వైద్య పరీక్షలు అవసరం ఉన్నందున, ఈ నెలాఖరులో లేదా మార్చి మొదటి వారంలో ఆయన మిగతా పరీక్షలను చేయించుకోనున్నారు.

సయాటికాతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా సయాటికాతో బాధపడుతున్నారు. అందుకే ఆయన ఇటీవల సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శిస్తే ఆరోగ్యం నమవుతుందని భావించే, కేరళ, తమిళనాడులోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలను సందర్శించారు. తాజాగా ప్రయాగ‌రాజ్‌కు వెళ్లి పుణ్య స్నానం కూడా ఆచరించి వచ్చారు. అయితే ఒక్కసారిగా పవన్ కల్యాణ్ అపోలో హాస్పిటల్‌కు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవడంపై అభిమానంలో కొంత ఆందోళన నెలకొంది.

అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా?

ఫిబ్రవరి 24వ తేదీ నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలకు పవన్ కళ్యాణ్ హాజరవుతారని ఆయన కార్యాలయం ప్రకటించింది. అయితే, వైద్యుల సూచనల మేరకు ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించనున్నారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేసే అవకాశం ఉంది. అయితే, ఆయన కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ప్రస్తుతం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పవన్ కళ్యాణ్ త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి విధుల్లో పాల్గొంటారని తెలిపారు.

రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషిస్తున్నందున, ఆయన ఆరోగ్య పరిస్థితిపై అందరి దృష్టి ఉంది. బడ్జెట్ సమావేశాల్లో ఆయన పాల్గొంటారని ప్రకటించడం ఆయన అభిమానులకు కొంత ఊరట. పవన్ కళ్యాణ్ ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..