Andhra Pradesh Floods: ఆంధ్రప్రదేశ్‌లో 20 గ్రామాల మునకకు, వంద మంది ప్రాణాలు కోల్పోవడానికి ఇసుక మాఫియా నే కారణం అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. ఏపీలో వరదల అంశంపై మీడియాతో మాట్లాడిన ఆయన.. వరదల వల్ల నష్టపోయిన ప్రజానీకాన్ని ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని, తక్షణ సహాయం కింద కుటుంబానికి రూ. 20 వేలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, చనిపోయిన కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం ఇవ్వాలన్నారు. వరదల్లో ఇల్లు కోల్పోయిన వారికి ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు మంజూరు చేయాలని సీపీఐ రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇసుక మాఫియా వల్లే అన్నమయ్య ప్రాజెక్టు ఎర్త్ డ్యాం తెగిపోయిందన్నారు.
ఎడతెరపి లేని భారీ వర్షాలకు కడప జిల్లా రాజంపేట మండలంలోని ప్రాంతాల్లో వరదలు వచ్చి పరివాహక ప్రాంతాలను అతలాకుతలమైన విషయం తెలిసిందే. అయితే, ప్రభుత్వం యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించిందని ఆరోపించారు. దీనికి ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలన్నారు. గత 20 రోజులుగా భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తునప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం కావాలని వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ సరిగ్గా విపత్తు ఎదురయ్యే సమయానికి అధికారుల సమన్వయ లోపం, ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రదర్శించిందన్నారు. అధికారిక లెక్కల ప్రకారమే 39 మంది, స్థానికుల వివరాల ప్రకారం వంద మందికిపైగా ప్రాణాలు పోయాయన్నారు. అలాగే సుమారు 1,500 పశువులు, వెయ్యి గొర్రెలు, మేకలు, వరి ధాన్యం పూర్తిగా నష్టం జరిగిందన్నారు. వరద బాధిత ప్రాంతాల్లో ప్రజలు ఆహారధాన్యాలు, వంట సామాగ్రి సైతం లేక ఇబ్బందులు పడుతున్నారని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.
పించా ప్రాజెక్టు తెగిపోతే అన్నమయ్య ప్రాజెక్టు తట్టుకోలేదని తెలిసి కూడా అధికారులు అప్రమత్తం కాకపోవడం, శాశ్వత మరమ్మతులు చేపట్టకపోవడం దారుణమన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే ప్రాజెక్ట్ మరమ్మతులకు నిధులు కేటాయించకపోవడం విచారకరమన్నారు. ఇదిలాఉంటే.. ఎగువ మందపల్లెలలోని కుటుంభంలో 9 మందిని కోల్పోయిన పూజారి కుటుంబాన్ని రామకృష్ణ బృందం పరామర్శించింది. ఈ సందర్భంగా ప్రతి కుటుంభానికి తక్షణ సహాయం క్రింద 20000/- వేలు, మృతులకు 25,00,000 లక్షలు, ఒక్కో గృహానికి 5 లక్షలతో ఇండ్లు కట్టించి ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ బృందంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పులి కృష్ణమూర్తి. గాలి చంద్ర , ఎల్ నాగసుబ్బారెఢ్ఢి, విజయలక్ష్మి , బషీరున్నిస, చంద్రశేఖర్, వెంకటశివ, వీరశెఖర్, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి పి.మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Also read:
Rashmi Gautam: ఒంపు సొంపులతో పిచ్చెక్కిస్తున్న జబర్దస్త్ బ్యూటీ..
Aaradhya : ఐశ్వర్య ఆరాధ్య చేతిని వదిలేయి.. మరోసారి ట్రోలర్ల బారిన పడ్డ తల్లీకూతుళ్లు..
Shamna Kasim: కనువిందు చేసే అందంతో ఫాన్స్‌ని కట్టిపడేస్తున్న `ఢీ` పూర్ణ..