AP Corona Cases: ఏపీలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. కొత్తగా 1627 మందికి పాజిటివ్, 17మంది మృతి

|

Jul 26, 2021 | 5:46 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరోనా మహమ్మారి ఇప్పుడప్పుడే వదిలడంలేదు. గడిచిన 24 గంటల్లో 57,672 శాంపిల్స్ పరీక్షించగా.. 1,627 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

AP Corona Cases: ఏపీలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. కొత్తగా 1627 మందికి పాజిటివ్, 17మంది మృతి
Corona
Follow us on

AP News Corona Cases Today: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరోనా మహమ్మారి ఇప్పుడప్పుడే వదిలి పెట్టేలా లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 57,672 శాంపిల్స్ పరీక్షించగా.. 1,627 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 19,56,392కి చేరింది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా మరో 17 మంది కరోనా మహమ్మారిని జయించలేక ప్రాణాలను కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం మరణించిన వారి సంఖ్య 13,273కి పెరిగింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ సోమవారం సాయంత్రి విడుదల చేసిన బులిటెన్‌‌లో పేర్కొంది.

ఇక, ప్రస్తుతం రాష్ట్రంలో 21,748 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇదిలావుంటే, గడిచిన 24 గంటల వ్యవధిలో 2,017 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్ఛార్జి అయినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇక, చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఐదుగురు, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో ఇద్దరు, నెల్లూరు, పశ్చిమగోదావరి, కడప జిల్లాల్లో ఒకరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు, కరోనా నివారణకు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. మహమ్మారి నుంచి రక్షించుకోవాలంటే ప్రతి ఒక్కరు కోవిడ్ టీకా తీసుకోవాలని ఏపీ రాష్ట్ర సర్కార్ సూచిస్తోంది.

ఇక, జిల్లాల వారీగా నమోదు కోవిడ్ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి..