Andhra Pradesh Corona Cases: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్ వేవ్ పీక్స్‌లో ఉంది. రోజు రోజుకు కరోనా బారిన పడే వారి సంఖ్య గతేడాది కంటే అధికంగా నమోదు అవుతున్నాయి. నెల క్రితం వందల సంఖ్యలోనే నమోదైన కరోనా కేసులు.. ఇప్పుడు వేలకు చేరింది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 31,719 సాంపిల్స్ పరీక్షించగా.. 3,495 మందికి కరోనా పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు. వీరిలో కొందరు ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తుండగా.. మరికొందరు హోంఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ఇక కరోనా కారణంగా ఒక్క రోజులు తొమ్మిది మంది చనిపోయారు. చనిపోయిన వారిలో చిత్తూరు జిల్లాకు చెందిన నలుగురు బాధితులుండగా.. గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కరు చొప్పున బాధితులు ఉన్నారు. గడిచిన 24 గంటల్లో 1,198 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 20,954 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక నేటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 9,25,401 మంది కరోనా బారిన పడగా.. వీరిలో 8,97,147 మంది కరోనాను జయించారు. ఇదే సమయంలో 7,300 మంది బాధితులు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
ఇదిలాఉంటే తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో నమోదయ్యాయి. ఈ జిల్లాలో ఒక్కరోజులోనే గరిష్టంగా 719 మంది కరోనా బారిన పడ్డారు. ఆ తరువాత స్థానంలో గుంటూరు జిల్లా నిలిచింది. గుంటూరులో 501 కేసులు నమోదు అయ్యాయి. ఇక విశాఖపట్నంలో 405, కృష్ణా జిల్లాలో 306, శ్రీకాకుళంలో 293, ప్రకాశం 215, అనంతపురంలో 209 చొప్పున కేసులు నమోదు అయ్యాయి. ఇదిలాఉంటే.. శనివారం నాడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 3,339 పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే.
Also read:
Maharashtra Threat: తెలంగాణకు ‘మహా’ ముప్పు.. రాకపోకలపై నిఘా లేదు.. బోర్డర్‌లో పరీక్షలు అంతంత మాత్రమే