Mahanandi Temple: మహానంది ఆలయ సమీపంలో నాగుపాము హల్‌చల్
Andhra Pradesh: ఆలయం ముందు నాగుపాము బుసలు కొడుతూ ఉండటాన్ని చూసిన భక్తులు ఓం నమశ్శివాయ, ఓం నమశ్శివాయ అంటు శివ నామస్మరణలు చేశారు. అనంతరము స్నేక్ స్నాచర్ మోహన్ నాగుపామును ఓక సంచిలో బంధించి సమీపంలో ఉన్న అడవిలో వదిలి..

చిరుత పులులు పెద్ద పులులు ఎలుగుబంట్లు… ఇప్పుడు నాగుపాములు సైతం మహానంది క్షేత్రాన్ని వదలడం లేదు. నంద్యాల జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రం మహానంది ఆలయ సమీపంలో నాగుపాము హల్ చల్ చేసింది. ఆలయ సమీపంలో నాగుపామును గుర్తించిన భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. విషయం తెలుసుకున్న ఆలయ అధికారులు అప్రమత్తం అయిన వెంటనే స్థానిక స్నేక్ స్నాచర్ మోహన్ సమాచారం ఇచ్చారు. గంట సేపు శ్రమించిన స్నేక్ స్నాచర్ నాగుపామును ఆలయ గాలి గోపరం ముఖ ద్వారం వద్ద నాగుపామును చాకచక్యంగా బంధించారు.
ఆలయం ముందు నాగుపాము బుసలు కొడుతూ ఉండటాన్ని చూసిన భక్తులు ఓం నమశ్శివాయ, ఓం నమశ్శివాయ అంటు శివ నామస్మరణలు చేశారు. అనంతరము స్నేక్ స్నాచర్ మోహన్ నాగుపామును ఓక సంచిలో బంధించి సమీపంలో ఉన్న అడవిలో వదిలి పెట్టారు. దీంతో ఆలయ అధికారులు, భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. మహానంది ఆలయం చుట్టూ చిరుతలు పెద్దపులులు ఎలుగుబంట్లు తరచుగా తిరుగుతుండేవి. సీసీ కెమెరాలు ఈ విషయాల్లో స్పష్టంగా కనిపించాయి. ఇప్పుడు పెద్ద పెద్ద నాగుపాములు సైతం ఆలయం దగ్గరకు వస్తుండటంతో భక్తులు ఆందోళనకు గురవుతున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
