YSR Nethanna Nestham: సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్ సర్కార్.. మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని నేతన్నలకు ఆసరాగా ఉండేందుకు తీసుకువచ్చిన ‘వైఎస్ఆర్ నేతన్న నేస్తం’ పథకంలో భాగంగా మూడవ విడత నిధులు విడుదల చేయనున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం వర్చువల్‌గా మూడో విడత ‘వైఎస్ఆర్ నేతన్న నేస్తం’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా సొమ్మును జమ చేస్తారు. ఈ పథకంలో భాగంగా ప్రతీ లబ్ధిదారుని ఖాతాలో రూ. 24 వేలు అందించనున్నారు.
రాష్ట్రంలో మగ్గం ఉన్న ప్రతీ చేనేత కుటుంబానికి ‘వైఎస్ఆర్ నేతన్న నేస్తం’ పథకం కింద రూ. 24 సాయం అందించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. గతంలోనే ప్రకటించారు. 2019, డిసెంబర్ 21న ఈ పథకాన్ని ప్రారంభించగా.. ఇప్పటి వరకు రెండు దఫాలుగా లబ్ధిదారులకు నిధులు విడుదల చేశారు. ఇప్పుడు మూడో విడతగా.. లబ్ధిదారులకు డబ్బులు అందిస్తున్నారు. అర్హులందరికీ ఈ పథకం వర్తింపచేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
Also read:
Gardening: ఇంటితోట కోసం మొక్కలు కొంటున్నారా? ఈ విషయాలు జాగ్రత్తగా పరిశీలించండి..