CM Jagan Tour: ఎన్టీఆర్‌ జిల్లాలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన.. జగనన్న విద్యాదీవెన నిధులు విడుదల

|

Mar 19, 2023 | 6:00 AM

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జగనన్న విద్యాదీవెన పథకం నాలుగో విడత ..

CM Jagan Tour: ఎన్టీఆర్‌ జిల్లాలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన.. జగనన్న విద్యాదీవెన నిధులు విడుదల
Cm Ys Jagan
Follow us on

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జగనన్న విద్యాదీవెన పథకం నాలుగో విడత నిధులను విడుదల చేస్తారు. 11 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 700 కోట్ల రూపాయలు బటన్ నొక్కి జమచేస్తారు. అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగిస్తారు. ఉదయం 10గంటల 10 నిమిషాలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరుతారు సీఎం జ‌గ‌న్. కార్యక్రమం పూర్తయిన అనంతరం తిరిగి 1.25 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు సీఎం. సీఎం పర్యటన నేపథ్యంలోకట్టుదిట్టమైన బందోబస్త్ ఏర్పాటుచేశారు అధికారులు.

జగనన్న విద్యా దీవెన పథకం కింద అర్హులైన పేద విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ అందజేస్తోంది. ఇంజినీరింగ్, మెడిసిన్‌, డిగ్రీ ఇతర కోర్సులు చేసేవారికి రూ.20 వేలు అందిస్తున్నారు. ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15 వేలు ప్రభుత్వం అందజేస్తుంది. కాలేజీలకు కట్టాల్సిన ఫీజులను మూడు నెలలకు ఒకసారి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుంది. విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన ఫీజులను మూడు నెలలు ముగిసిన వెంటనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది. పేద విద్యార్థులు భోజనం, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ప్రభుత్వం వారికి నిధులు అందిస్తుంది. జగనన్న వసతి దీవెన పథకం కింద ఏటా రెండు వాయిదాల్లో ఇంజినీరింగ్, మెడిసిన్‌, డిగ్రీ ఇతర కోర్సులు చేసేవారికి రూ.20 వేలు అందిస్తు్న్నారు. ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15 వేలు ఆర్థిక సాయం అందిస్తోంది ప్రభుత్వం.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి