CM Jagan: సీఎం జగన్ కడప పర్యటన.. వైఎస్సార్ కు నివాళులర్పించనున్న ముఖ్యమంత్రి.. పూర్తి వివరాలివే

| Edited By: Ravi Kiran

Aug 31, 2022 | 6:18 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan) మూడు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. సెప్టెంబరు 1 నుంచి 3 వ తేదీ వరకు ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సెప్టెంబరు 1వ తేదీ సాయంత్రం వేముల..

CM Jagan: సీఎం జగన్ కడప పర్యటన.. వైఎస్సార్ కు నివాళులర్పించనున్న ముఖ్యమంత్రి.. పూర్తి వివరాలివే
Ys Jagan
Follow us on

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan) మూడు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. సెప్టెంబరు 1 నుంచి 3 వ తేదీ వరకు ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సెప్టెంబరు 1వ తేదీ సాయంత్రం వేముల మండలంలోని వేల్పుల గ్రామ సచివాలయ కాంప్లెక్స్‌ను ప్రారంభించనున్న సీఎం.. 2న మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్బంగా వైఎస్సార్‌ ఘాట్‌లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. అనంతరం పులివెందుల (Pulivendula) నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని, 3 వ తేదిన ప్రత్యేక హెలికాఫ్టర్‌లో కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. ఈ మేరకు సంబంధిత అధికారులు ముఖ్యమంత్రి పర్యటన వివరాలు వెల్లడించారు. సెప్టెంబరు 1న మధ్యాహ్నం 2.00 గంటలకు తన నివాసం నుంచి సీఎం బయల్దేరతారు. 2.20 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని, విమానంలో 3.20కు కడప చేరుకుంటారు. 3.50 గంటలకు వేముల మండలంలోని వేల్పుల గ్రామానికి వెళ్లి.. 4.05 వరకు స్థానిక నేతలతో ముచ్చటించనున్నారు. 4.10 నుంచి 5.10 గంటల వరకు వేల్పులలోని సచివాలయ కాంప్లెక్స్‌ను ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి 5.35 గంటలకు హెలికాఫ్టర్‌లో ఇడుపులపాయ గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు.

2 తేదీన వైఎస్సార్ వర్థంతి సందర్భంగా ఉదయం 8.50 గంటలకు ఇడుపులపాయ నుంచి రోడ్డు మార్గాన 9 గంటలకు వైఎస్సార్‌ ఘాట్‌కు చేరుకుంటారు. 9 నుంచి 9.40 గంటల వరకు వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పిస్తారు. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇడుపులపాయలో పులివెందుల నియోజకవర్గ అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. 5.10 గంటలకు గెస్ట్‌హౌస్‌ చేరుకుంటారు. ఆరోజు రాత్రి కూడా సీఎం జగన్ అక్కడే బస చేస్తారు.

3 వ తేదీన ఉదయం 8.50 గంటలకు ఇడుపులపాయ గెస్ట్‌హౌస్‌ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 9 గంటలకు హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి 9.15 గంటలకు కడప ఎయిర్‌ పోర్టుకు వెళ్తారు. 9.20 గంటలకు ప్రత్యేక విమానంలో కడప నుంచి బయలుదేరి 10.10 గంటలకు గన్నవరం విమానాశ్రయం, అక్కడి నుంచి తన నివాసానికి వెళ్లనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.