Andhra Pradesh: లోన్ యాప్ ఆగడాలపై ఏపీ ప్రభుత్వం సిరీయస్.. ఇక నుంచి ఆసంస్థలపై కఠిన చర్యలు..

|

Sep 08, 2022 | 2:09 PM

మైక్రో ఫైనాన్స్, లోన్ యాప్ ఆగడాలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. దీంతో చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఈతరహ ఘటనలె ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ..

Andhra Pradesh: లోన్ యాప్ ఆగడాలపై ఏపీ ప్రభుత్వం సిరీయస్.. ఇక నుంచి ఆసంస్థలపై కఠిన చర్యలు..
Ys Jagan
Follow us on

Andhra Pradesh: మైక్రో ఫైనాన్స్, లోన్ యాప్ ఆగడాలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. దీంతో చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఈతరహ ఘటనలె ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ అవుతున్నాయి. అధికంగా వడ్డీలు విధిస్తూ మొత్తం కట్టాల్సిందేనని, లేదంటే న్యూడ్ వీడియోలు పెడతామని బెదిరిస్తుండటంతో చాలామంది గత్యంతరం లేక డబ్బులు కట్టలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వేలల్లో రుణాలు ఇచ్చి.. లక్షల్లో వసూలు చేస్తున్న ఘటనలు ఈమధ్య వెలుగులోకి వచ్చాయి. ఈలోన్ యాప్ ప్రతినిధులు ఇటీవల కాలంలో మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులకు కూడా కాల్ చేసి మంత్రి సంబంధిత బంధువులు లోన్ తీసుకున్నారని.. మీరు కట్టాలంటూ అడిగిన సందర్భాలున్నాయి. ఇలా రోజురోజుకు లోన్ యాప్ సంస్థల ఆగడాలు పెరిగిపోతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఈసంస్థలపై కఠినంగా వ్యవహరించాలని డిసైట్ అయింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) అనుమతి లేని లోన్‌ యాప్‌లపై కఠినంగా వ్యవహరించాలని ఇప్పటికే అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈమేరకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం.  ఈవిషయంలో కఠినంగా వ్యవహరించాలని నేరుగా నేరుగా సీఏం జగన్మోహన్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఇక నుంచి రాష్ట్రంలో లోన్ యాప్ ఆగడాల వల్ల ఎవరూ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉండకూడదన్నారు.

ఆత్మహత్య చేసుకున్న కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం:  తాజాగా లోన్ యాప్ ఆగడాలకు తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరంలో లోన్ యాప్‌ల వేధింపుల వల్ల భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో వారి పిల్లలు అనాథలయ్యారు. ఈ సంఘటనపై సీఎం వైఎస్.జగన్మోహన్‌ రెడ్డి స్పందించారు. ఆత్మహత్య చేసుకున్న కొల్లి దుర్గారావు, రామలక్ష్మి దంపతుల చిన్నారులు నాలుగేళ్ల తేజస్వి నాగసాయి, రెండేళ్ల లిఖిత శ్రీలకు ఇద్దరికి ఒక్కొక్కరికి రూ.5,00,000 ఆర్థిక సహాయం అంద చేయాలని జిల్లా కలెక్టర్ కె. మాధవీలతను ఆదేశించారు. ఆన్‌లైన్ లోన్ యాప్‌ల వేధింపులు భరించలేక రాజమహేంద్రవరానికి చెందిన భార్యాభర్తలు దుర్గారావు, రామలక్ష్మి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాజమండ్రిలో సంచలనం రేపిన విషయం తెలిసిందే. అప్పు కట్టాలని లేదంటే న్యూడ్ వీడియోలు బయటపెడతామని, ఫేస్ మార్పింగ్ చేశామని లోన్ యాప్ నిర్వహకులు ఆ దంపతులను బెదిరించారు. దీంతో సెప్టెంబర్ 6వ తేదీన రాజమహేంద్రవరం శాంతినగర్‌కు చెందిన ఈ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. దుర్గారావు, పెయింటర్‌గా, రామలక్ష్మి టైలరింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా, రాజవొమ్మంగి మండలం, లబ్బర్తి గ్రామానికి చెందిన దుర్గారావు దంపతులు జీవనోపాధికోసం పదేళ్ల క్రితం రాజమండ్రికి వలస వచ్చారు. వారికి ఇద్దరు పిల్లలు. ఆర్థిక ఇబ్బందులతో ఇటీవల ఆన్‌లైన్ లోన్ యాప్‌లో అప్పుగా తీసుకున్నారు. కొంత చెల్లించారు. మిగతా డబ్బు సమయానికి చెల్లించకపోవడంతో యాప్‌ల నిర్వాహకుల నుంచి బెదిరింపులు, వేధింపులు ఎదురయ్యాయి. దీంతో మనస్తాపం చెందిన ఆ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..