AP Cabinet : ఆగస్టు 6న సమావేశం కానున్న ఏపీ కేబినెట్.. పలు కీలక అంశాలపై చర్చలు

|

Jul 31, 2021 | 6:49 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గంఆగస్టు 6న సమావేశం కానుంది.

AP Cabinet : ఆగస్టు 6న సమావేశం కానున్న ఏపీ కేబినెట్.. పలు కీలక అంశాలపై చర్చలు
Jagan
Follow us on

AP Cabinet Meeting: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గంఆగస్టు 6న సమావేశం కానుంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు జరగనున్న రాష్ట్ర కేబినెట్ బేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. కోవిడ్‌ నియంత్రణపై సర్కార్‌ తీసుకుంటున్న చర్యలు, సంక్షేమ పథకాల అమలుతో పాటు ప్రధానంగా తెలంగాణతో జరుగుతున్న జల వివాదంపైనా మంత్రిమండలి చర్చించనుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్‌ క్యాలెండర్‌పై వస్తున్న విమర్శలపైనా చర్చించనుంది.

వచ్చే నెలలో నిర్మాణం చేపట్టే మూడు లక్షల జగనన్న ఇళ్ల నిర్మాణంపై ఏపీ కేబినెట్ చర్చించనుంది. దిశా చట్టం అమలు, ప్రజల నుంచి వస్తున్న స్పందనపై మంత్రులు చర్చిస్తారు. ఇటీవల అఘాయిత్యాలు, భవిష్యత్తులో పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించే అవకాశం ఉంది. నూతన ఐటీ పాలసీకి ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలపనుంది. పేదల ఇళ్లపట్టాల క్రమబద్దీకరణకూ ఆమోదముద్ర వేయనుంది. శాసన మండలి చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక కోసం ప్రత్యేకంగా సమావేశం నిర్వహణపైనా చర్చ జరిగే అవకాశం వుంది.

Read Also…

Tortoise Rocket: తాబేళ్లు దగ్గరుంటే అదృష్టం వరిస్తుందా..? స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టుతో వెలుగులోకి వస్తున్న నిజాలు..!