AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు గవర్నర్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగంతో మొదలయ్యాయి. గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసగించారు (Governor speech). వైసీపీ ప్రభుత్వం పేదల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఇదిలా ఉంటే గవర్నర్ ప్రసంగం కొనసాగుతున్నంత సేపు టీడీపీ నాయకులు సభలో హంగామా సృష్టించారు. గవర్నర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగ ప్రతులను చింపేసి నానా హంగామా చేశారు. అనంతరం వాకౌట్ చేసిన సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. దీంతో గవర్నర్ ప్రసంగం ప్రతిపక్ష నాయకులు లేకుండానే ముగిసింది.
ఇదిలా ఉంటే గవర్నర్ ప్రసంగం ముగిసిన వెంటనే వైసీపీ నేతలు బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో భాగంగా ఈ నెల 25 వరకూ సమావేశాలు జరపాలని నిర్ణయించారు. సమావేశంలో భాగంగా అచ్చెన్నాయుడుపై ముఖ్యంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడంపై ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. గవర్నర్ మీ పార్టీ కాదు, మా పార్టీ కాదని సీఎం చెప్పారు. వయసులో అంత పెద్ద వ్యక్తిని అవమానించడం సరికాదని సీఎం తెలిపారు. గతంలో గవర్నర్ విషయంలో ఎన్నడూ ఇలా జరగలేదని జగన్ అభిప్రాయపడ్డారు.
జిల్లాల విభజన, ప్రత్యేక హోదా-విభజన హామీలు,పోలవరం ప్రాజెక్ట్-గత ప్రభుత్వం తప్పిదాలు, రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ, శాంతిభద్రతలు-ప్రభుత్వం, ప్రతిపక్షాల పాత్ర, అవినీతి నిర్మూలనతో పాటు మొత్తం 25 అంశాలపై అసెంబ్లీలో చర్చించాలని వైసీపీ కోరింది.
ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఎవరూ ఊహించని విధంగా గవర్నర్ ప్రసంగానికి అడ్డుతగిలింది. సభ ప్రారంభమై గవర్నర్ ప్రసంగం మొదలు పెట్టగానే పెద్ద ఎత్తున నినాదాలు చేశారు టీడీపీ సభ్యులు. రాజ్యాంగ వ్యవస్థలను కాపాడలేని గవర్నర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఒక దశలో వెల్‌లోకి వచ్చి ప్రసంగ ప్రతులను చించేసి పోడియంపైకి విసిరేశారు ప్రతిపక్ష సభ్యులు. వారి నినాదాలు, ఆందోళనతో దాదాపు 20 నిమిషాలు గవర్నర్ ప్రసంగానికి తీవ్ర ఆటంకం కలిగింది. వారి నినాదాల మధ్యే ప్రసంగాన్ని కంటిన్యూ చేశారు గవర్నర్. టీడీపీ సభ్యుల తీరుపై సీఎం జగన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలోకి మార్షల్స్ వచ్చే సమయానికి టీడీపీ సభ్యులు వాకౌట్ చేసి బయటకు వచ్చేశారు.
Also Read: India Corona: దేశంలో గణనీయంగా తగ్గిన కోవిడ్.. 4 వేల దిగువకు కేసులు నమోదు.. తగ్గుతున్న మరణాలు
riyanka Mohan: ట్రెండీ లుక్స్ తో ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్న ప్రియాంక మోహన్… లేటెస్ట్ ఫోటోస్ వైరల్
Aloe Vera: ఆ సమస్యతో బాధపడితే కలబంద వాడండి.. తక్షణమే ఉపశమనం..