Andhra Pradesh: మూడేళ్ల పాలనలో ఎన్నో మంచి పనులకు శ్రీకారం చుట్టాం.. సీఎం జగన్ ట్వీట్

|

May 30, 2022 | 11:08 AM

ముఖ్యమంత్రిగా(Chief Minister) బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సీఎం.జగన్మోహన్ (AP.CM.Jagna) రెడ్డి ట్వీట్ చేశారు. మీరు చూపిన ప్రేమ‌, మీరు అందించిన ఆశీస్సుల‌తో ముఖ్యమంత్రిగా బాధ్యత‌లు చేప‌ట్టి....

Andhra Pradesh: మూడేళ్ల పాలనలో ఎన్నో మంచి పనులకు శ్రీకారం చుట్టాం.. సీఎం జగన్ ట్వీట్
Cm Jagan
Follow us on

ముఖ్యమంత్రిగా(Chief Minister) బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సీఎం.జగన్మోహన్ (AP.CM.Jagna) రెడ్డి ట్వీట్ చేశారు. మీరు చూపిన ప్రేమ‌, మీరు అందించిన ఆశీస్సుల‌తో ముఖ్యమంత్రిగా బాధ్యత‌లు చేప‌ట్టి మూడేళ్లు అవుతోందని ట్విట్టర్(Twitter) వేదికగా అభిప్రాయం పంచుకున్నారు. న‌మ్మకాన్ని నిల‌బెట్టుకుంటూ, గ‌డిచిన మూడేళ్లలో 95 శాతానికి పైగా హామీల‌ను అమ‌లు చేశామని అన్నారు. ఎన్నో మంచి ప‌నుల‌కు శ్రీ‌కారం చుట్టామని ట్వీట్ చేసిన సీఎం.. రాబోయే రోజుల్లో మరింతగా సేవ చేస్తానని, ప్రజల ప్రేమాభిమానాలు తనపై ఎప్పటికీ ఇలాగే ఉండాలని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాని హర్షం వ్యక్తం చేశారు. సేవ చేసే భాగ్యాన్ని కల్పించినందుకు మ‌రొక్కసారి అందరికీ కృత‌జ్ఞతలు తెలుపుతున్నానని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి