CM Jagan – PM Modi: కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.. కానీ రాష్ట్రాలకు పూర్తి అధికారం ఉంటుంది.. ప్రధాని మోడీకి సీఎం జగన్ లేఖ..

| Edited By: Sanjay Kasula

Jan 28, 2022 | 9:31 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(Prime Minister Modi)కి ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి (AP CM Jagan)లేఖ రాశారు. కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తూనే రాష్ట్రాలకు పూర్తి అధికారం ఉంటుందని లేఖలో..

CM Jagan - PM Modi: కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.. కానీ రాష్ట్రాలకు పూర్తి అధికారం ఉంటుంది.. ప్రధాని మోడీకి  సీఎం జగన్ లేఖ..
Cm Jagan Writes A Letter To Prime Minister Modi
Follow us on

AP CM Jagan Letter to PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(Prime Minister Modi)కి ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి (AP CM Jagan)లేఖ రాశారు. కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తూనే రాష్ట్రాలకు పూర్తి అధికారం ఉంటుందని లేఖలో పేర్కొన్నారు సీఎం జగన్. ఆలిండియా సర్వీస్‌ రూల్స్‌ సవరణకు సంబంధించి లేఖలో పేర్కొన్నారు. ఐఏఎస్‌ అధికారుల్ని డిప్యుటేషన్‌పై పంపాలనే కేంద్ర నిర్ణయాన్ని సీఎం జగన్‌ స్వాగతించారు. అయితే.. రాష్ట్రాల్లో ఉన్న ఐఏఎస్ అధికారులను కేంద్ర సర్వీసుకు పంపడానికి ఇబ్బంది లేదని, కానీ ఎవర్ని పంపాలి అనే అంశం రాష్ట్రాలే నిర్ణయిస్తే బాగుంటుందని లేఖ సీఎం జగన్ పేర్కొన్నారు. అధికారుల పనితీరు, సామర్థ్యం రాష్ట్ర ప్రభుత్వానికే తెలుస్తుంది కాబట్టి ఆ నిర్ణయం రాష్ట్రాలకే వదిలేస్తే బాగుంటుందని ప్రధాని మోడీకి జగన్ రాసిన లేఖలో పేర్కొన్నారు.

ప్రధాని మోడీకి సీఎం జగన్ రాసిన లేఖ..

Cm Jagan Writes A Letter To Pm Modi

ఇవి కూడా చదవండి: Viral Video: స్నేహం అంటే ఇదే రా.. స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయిన ఫ్రెండ్‌ను రక్షించిన కుక్క..

Viral Video: ఈ మేకకు ఏమైనా శక్తులున్నాయా..? వీడియో చూసి నోరెళ్లబెడుతున్న నెటిజనం..