CM Jagan: పారిస్‌కు బయలుదేరిన సీఎం జగన్‌.. కుమార్తె గ్రాడ్యుయేషన్‌ కాన్వొకేషన్‌ వేడుక కోసం..

తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసం నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి విమానంలో పారిస్‌ బయలుదేరారు. బుధవారం ఉదయం 5.10 గంటలకు పారిస్‌ చేరుకుంటారు. అక్కడ తన కుమార్తె గ్రాడ్యుయేషన్‌..

CM Jagan: పారిస్‌కు బయలుదేరిన సీఎం జగన్‌.. కుమార్తె గ్రాడ్యుయేషన్‌ కాన్వొకేషన్‌ వేడుక కోసం..
CM JAGAN

Updated on: Jun 28, 2022 | 10:03 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పారిస్‌కు బయలుదేరారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసం నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి విమానంలో పారిస్‌ బయలుదేరారు. బుధవారం ఉదయం 5.10 గంటలకు పారిస్‌ చేరుకుంటారు. అక్కడ తన కుమార్తె గ్రాడ్యుయేషన్‌ కాన్వొకేషన్‌ వేడుకలో పాల్గొననున్నారు. పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి.. మొత్తం నాలుగు రోజుల పాటు వైఎస్ జగన్ పర్యటన సాగనుంది. తన పెద్ద కుమార్తె హర్ష.. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇన్‌సీడ్‌ బిజినెస్‌ స్కూల్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌(ఎంబీఏ) పూర్తి చేసుకోవడంతో.. గ్రాడ్యుయేషన్‌ డే వేడుకలో పాల్గొంటారు.

జ‌గ‌న్ పారిస్‌లో వ‌చ్చే నెల 2వ తేదీ వ‌ర‌కు ప‌ర్య‌టించ‌నున్నారు. సీఎం జగన్‌.. 29న ప్యారిస్‌కు చేరుకుంటారు. కుమార్తె గ్రాడ్యుయేషన్‌ డే వేడుకలో పాల్గొన్న తర్వాత.. జులై 2న తిరుగు ప్రయాణం అవుతారు. ఆ తర్వాత జులై 3న ఉదయం 6.45 గంటలకు గన్నవరం చేరుకుంటారు. ఫ్రాన్స్ రాజ‌ధాని పారిస్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లేందుకు అనుమ‌తి ఇవ్వాలంటూ జ‌గ‌న్ ఇటీవ‌లే పిటిష‌న్ దాఖలు చేయ‌గా… నాంప‌ల్లిలోని సీబీఐ కోర్టు అందుకు అనుమ‌తిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే.

ఏపీ వార్తల కోసం..

Loading...
Unable to load recommendations.
Follow Us