ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ.. ఉద్యోగుల పంపకంతో పాటు అసెంబ్లీ బడ్జెట్ సెషన్‌పై క్లారిటీ వచ్చే అవకాశం..

|

Feb 23, 2021 | 1:49 AM

ఏపీ కేబినెట్ సమావేశం జరుగనుంది.  ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గ సమావేశం కానుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలు..

ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ.. ఉద్యోగుల పంపకంతో పాటు అసెంబ్లీ బడ్జెట్ సెషన్‌పై క్లారిటీ వచ్చే అవకాశం..
Follow us on

AP Cabinet to Meet : మంగళవారం ఏపీ కేబినెట్ సమావేశం జరుగనుంది.  ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గ సమావేశం కానుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారు ప్రధాన ఎజెండాగా కేబినెట్‌లో చర్చిస్తారని చెబుతున్నారు.

అసెంబ్లీలో ప్రవేశపెట్టి పలు బిల్లులను కూడా మంత్రివర్గం ఆమోదించనుంది. తిరుపతిలో జరగనున్న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంపైనా చర్చించే అవకాశం ఉందని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి.

రాష్ట్ర విభజన హామీలు, ఉద్యోగుల పంపకం, తదితర అంశాలపై.. రాష్ట్ర ప్రభుత్వ వాదనను ఎలా ఉండాలనే దానిపై కేబినెట్‌లో చర్చకు అవకాశం ఉంది. విశాఖ ఉక్కు, కార్మికుల ఉద్యమం, ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహంపైనా చర్చించే అవకాశం ఉంది.మరోవైపు విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ, గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలను సమావేశంలో సమీక్షించే అవకాశం ఉంది. మార్చిలో జరగనున్న మున్సిపల్, కార్పొరేషన్ల ఎన్నికలు.. సంక్షేమ పథకాలతో పాటూ కీలక అంశాలపై చర్చించనున్నారు. అంతేకాదు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తే.. విశాఖ ఉక్కుపై తీర్మానం చేయాలని భావిస్తున్నారట.. ఈ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి…