AP Inter Admissions-2021: ఏపీలో ఇంటర్మీడియట్ అడ్మిషన్లకు షెడ్యూల్ విడుదల చేసిన ఇంటర్ బోర్డు

|

Aug 10, 2021 | 9:58 PM

AP Inter Admissions-2021: ఏపీ ప్రభుత్వం ఇంటర్మీడియట్ అడ్మిషన్లపై కీలక ప్రకటన చేసింది. కరోనా కారణంగా పరీక్షలు రద్దు చేసి ఇటీవలే ఫలితాలను వెల్లడించిన ప్రభుత్వం..

AP Inter Admissions-2021: ఏపీలో ఇంటర్మీడియట్ అడ్మిషన్లకు షెడ్యూల్ విడుదల చేసిన ఇంటర్ బోర్డు
Follow us on

AP Inter Admissions-2021: ఏపీ ప్రభుత్వం ఇంటర్మీడియట్ అడ్మిషన్లపై కీలక ప్రకటన చేసింది. కరోనా కారణంగా పరీక్షలు రద్దు చేసి ఇటీవలే ఫలితాలను వెల్లడించిన ప్రభుత్వం అడ్మిషన్లకు రంగం సిద్ధం చేసింది. ఈనెల 16 నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ క్లాసులను ప్రారంభించనున్న ప్రభుత్వం.. అడ్మిషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే మొదటి దశలో భాగంగా ఈనెల 13వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఆన్‌లైన్‌ పద్దతిలో అడ్మిషన్లు కల్పిస్తున్నట్లు జారీ చేసిన ఉత్తర్వుల్లో తెలిపింది. గడువు ముగిసిన అనంతరం రెండో దశ అడ్మిషన్ల తేదీలను ప్రకటిస్తామని ఇంటర్మిడియట్ బోర్డు కార్యదర్శి రామ కృష్ణ తెలిపారు. రెగ్యులర్‌తో పాటు ఒకేషనల్ కోర్సులకు కూడా ఆన్‌లైన్‌ అడ్మిషన్ ఇస్తామని వెల్లడించారు. విద్యార్థులు http://bie.ap.gov.in వెబ్ సైట్ ద్వారా Online Admissions 2021-22 (APOASIS) User Manual ద్వారా అప్లే చేసుకోవాలని తెలిపారు.

విద్యార్ధులు ఆన్ లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపింది. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులు రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులకు రిజర్వేషన్, బాలికల కోటా ఆధారంగా ఆయా కాలేజీల్లో అడ్మిషన్లు కల్పిస్తామని పేర్కొన్నారు. అడ్మినషన్లకు సబంధించి ఏమైనా సందేహాలుంటే 18002749868 హెల్ప్ లైన్ నెంబర్ కు కాల్ చేయవచ్చని ప్రభుత్వం తెలిపింది. తల్లిదండ్రులు,విద్యార్థులు ఇంటర్ అడ్మిషన్ల కోసం ఎటువంటి సర్టిఫికెట్లు కాలేజీల వద్ద సమర్పించాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. హల్ టికెట్ ద్వారా కావాల్సిన కాలేజీలో అడ్మిషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు.

ఇవీ కూడా చదవండి

TS Engineering Counselling: తెలంగాణ ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

IDBI Bank Recruitment 2021: ఐడీబీఐ బ్యాంకులో ఉద్యోగాలు.. దరఖాస్తు చివరి తేదీ ఆగస్టు 22