AP Assembly Meeting : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఐదవ రోజు ప్రారంభమయ్యాయి. నేటి సమావేశంలో సమావేశాల్లో రాష్ట్రంలో పాడి పరిశ్రమల అభివృద్ధి-అమూల్‌తో భాగస్వామ్యంపై నేడు అసెంబ్లీలో చర్చించనున్నారు. అలాగే కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాడు-నేడు కార్యక్రమంపై చర్చించనున్నారు. ఇక శాసనమండలిలో పోలవరం ప్రాజెక్టు, టిడ్కో, పాఠశాలల్లో నాడు-నేడు కార్యక్రమం సహా ఐదు బిల్లులపై చర్చ జరపనున్నారు.