Vizag: ఏపీ సర్కార్ గంజాయి(Cannabis)పై ఉక్కుపాదం మోపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దేశ చరిత్రలోనే మొట్టమొదటి సారిగా భారీ స్థాయిలో గంజాయిని ధ్వంసం చేశారు ఏపీ పోలీసులు. ఆపరేషన్ పరివర్తన్(Operation Parivartan) కార్యక్రమంలో భాగంగా గంజాయి నిర్మూలనకు శ్రీకారం చుట్టారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో డీజీపీ గౌతం సవాంగ్(Goutam Sawang) వివిధ శాఖల సమన్వయంతో, సరిహద్దు రాష్ట్రాల సహకారాలతో ఈ కార్యక్రమం చేపట్టారు. విశాఖ ఏజెన్సీలో భారీ స్థాయిలో గంజాయి తోటలపై ఉక్కుపాదం మోపింది పోలీసు శాఖ. AOB తో పాటు గిరిజన గ్రామాలలో సాగవుతున్న గంజాయిని ధ్వంసం చేశామని తెలిపారు డీజీపీ. విశాఖ మన్యంతోపాటు ఆంధ్రా-ఒడిశా సరిహద్దు గ్రామాల్లో ఎన్నో ఏళ్లుగా గంజాయి సాగు కొనసాగుతోంది. అయితే ఇటీవల కాలంలో మత్తు సాగుకు విశాఖ హబ్‌గా మారిందని విమర్శలు వచ్చాయి. దేశంలోని వివిధ ప్రాంతాలకు వైజాగ్ నుంచే గంజాయి వెళ్తుందనే కామెంట్స్ వినిపించాయి. దీనిపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఓ రేంజ్‌లో మాటల యుద్ధం నడిచింది. దీంతో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ గంజాయి సాగుపై ఉక్కుపాదం మోపింది పోలీస్ శాఖ. ఈ క్రమంలో పట్టుబడిన 2లక్షల కిలోల గంజాయిని శనివారం దహనం చేశారు. ఈ గంజాయి విలువ సుమారు రూ.500 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఓ ఈవెంట్‌లా చేసింది పోలీస్ శాఖ. దీని కోసం టెంట్లు, స్పీకర్లు, డ్రోన్ కెమెరాలు వినియోగించారు.
Also Read: Andhra Pradesh: సాధారణ వాహన తనిఖీలు.. కంగారుగా యువకుడు.. ఎంక్వైరీ చేయగా దిమ్మతిరిగే ట్విస్ట్