Andhra-Odisha: ఆంధ్రా భూభాగంపై ఒడిశా పెత్తనం.. అంగన్‌వాడీ కేంద్రానికి తాళం..!

ఆంధ్రా, ఒరిశా సరిహద్దు గ్రామాల్లో వివాదం రోజు రోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. ఒకరు అవునంటే, మరొకరు కాదంటున్నారు.

Andhra-Odisha: ఆంధ్రా భూభాగంపై ఒడిశా పెత్తనం.. అంగన్‌వాడీ కేంద్రానికి తాళం..!
Andhra Odisha Border

Updated on: Sep 07, 2021 | 6:25 PM

Andhra-Odisha Border Dispute: ఆంధ్రా, ఒరిశా సరిహద్దు గ్రామాల్లో వివాదం రోజు రోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. ఒకరు అవునంటే, మరొకరు కాదంటున్నారు. నిన్నటి వరకూ విజయనగరం జిల్లా కొట్టిస గ్రామాల చుట్టూ తలెత్తిన వివాదం ఇవాళ సిక్కోలులో వెలుగుచూసింది. అధికారుల నిర్వాకంపై కదలిన ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.

శ్రీకాకుళం జిల్లాలో ఏడు మండలాల పరిధిలో ఆంధ్రా – ఒడిశా సరిహద్దు విస్తరించి వుంది. ఇప్పటి వరకూ ఎక్కడా సరిహద్దు వివాదానాకి తావు లేకుండా సరిహద్దు గ్రామాల్లో ఇరు రాష్ట్రాల్లో వున్న ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందుతు అన్నదమ్ముల్లా జీవిస్తున్నారు. ఈ తరుణంలో ఓ అంగన్వాడీ కేంద్రం నిర్వహణ విషయంలో ఒడిషా అధికారులు హల్ చల్ సృష్టించారు. శ్రీకాకుళం జిల్లాలోని మందస మండలం సాబకోట పంచాయితీ మాణిక్యపట్టణ గ్రామంలో ఒడిశా రాష్ట్ర అధికారులు వీరంగం చేసారు. ఆంధ్రా సరిహద్దులోని అంగన్వాడి కేంద్రానికి తాళం వేసి సీజ్ చేసారు.

సీజ్ చేసిన విషయంపై స్థానికులు అధికారులను ప్రశ్నించిన అంగన్వాడీ కార్యకర్త సవర లక్ష్మి భర్తను ఒడిషా అధికారులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. దీంతో జిల్లా కలెక్టర్ ఆదేశాలు మేరకు ఆ గ్రామాన్ని సందర్శించిన మండలాధికారులు వివాదంపై విచారణ చేపట్టారు. అది ఆంధ్రా భూభాగమేనని తేల్చిచెప్పిన మందస మండల అధికారులు స్పష్టం చేయడంతో పాటు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, అరెస్ట్ చేసిన వ్యక్తిని వెంటనే విడుదల చేయాలని మాణిక్యపట్టణ గ్రామస్తులు ఆందోళనకు దిగారు.

Read Also…  NRI Doctor: వీడిన ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సోదరుడి మిస్సింగ్ మిస్టరీ, అమెరికా ఫ్లైట్ ఎక్కాల్సిన డాక్టర్.. నీళ్ల కుంటలో శవంగా మారారు

ఏకంగా ముఖ్యమంత్రి తండ్రినే అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎక్కడ..? ఎందుకు..? పూర్తి వివరాలు