Andhra Pradesh: ఏపీలో మద్యం షాపుల టైమింగ్స్ ఇవే.. మందుబాబులు ఫుల్ ఖుషీ.

|

Oct 16, 2024 | 9:35 PM

ఏపీ మందుబాబులకు కిక్కెక్కింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్త ప్రైవేటు మద్యం దుకాణాలు ఓపెన్‌ అయ్యాయి. మద్యం షాపులకు లిక్కర్‌ లవర్స్‌ పోటెత్తడంతో సందడి నెలకొంది. లిక్కర్‌ బ్రాండ్లు చూసి మురిసిన పోయిన మందుబాబులు... రేట్లు చూసి డిసపాయిట్‌ అయ్యారు. మరి తగ్గిన ధరలు ఎప్పటి నుంచి అమల్లోకి రానున్నాయి..?

Andhra Pradesh: ఏపీలో మద్యం షాపుల టైమింగ్స్ ఇవే.. మందుబాబులు ఫుల్ ఖుషీ.
Andhra Liquor Shops
Follow us on

ఏపీలో కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చింది. ప్రైవేట్ మద్యం షాపుల్లో విక్రయాలు మొదలయ్యాయి. లాటరీలో షాపులు దక్కించుకున్న వాళ్లు కొత్త షాపులు తెరిచారు. దీంతో మందుబాబులు క్యూకట్టారు. 2019కి ముందున్న మద్యం బ్రాండ్లు తిరిగి అందుబాటులోకి వచ్చాయి. దీంతో మందుబాబులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. కింగ్ ఫిషర్, రాయల్ స్టాగ్, మాన్షన్ హౌస్, ఇంపీరియల్ బ్లూ వంటి బ్రాండ్లను చూసి మందుబాబులు ఆనందంలో తేలియాడుతున్నారు. అయితే 99 రూపాయల క్వార్టర్ ఆశించిన వారికి భంగపాటు తప్పలేదు. ఆ స్టాక్ ఇంకా రాలేదని… రెండు, మూడు రోజుల్లో వస్తుందని షాపు యజమానులు చెప్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాలకు నోటిఫై చేసి లాటరీ తీసి లైసెన్స్‌ కేటాయించారు. అయితే ప్రస్తుతం తక్కువ ధర మద్యం అందుబాటులో లేకపోవడంపై మందుబాబులు పెదవి విరుస్తున్నారు. పాత ధరలకే బాటిల్స్ విక్రయిస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. మద్యం ధరల్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో పలు చోట్ల విక్రేతలతో వాగ్వాదానికి దిగారు లిక్కర్‌ లవర్స్‌.

మరోవైపు లిక్కర్‌ పాలసీపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. మద్యం పాలసీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఎవరూ కూడా జోక్యం చేసుకోవద్దని స్పష్టం చేశారు. లిక్కర్ పాలసీల్లో ఎవరు వేలు పెట్టిన ఊరుకోమని హెచ్చరించారు.

ఇక ఏపీ వ్యాప్తంగా 3,396 కొత్తం మద్యం షాపులు తెరుచుకున్నాయి. కొన్ని చోట్ల ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వ మద్యం షాపుల్లోనే కొత్త షాపులు నిర్వహిస్తున్నారు. ఈ మద్యం షాపులు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటాయి. అయితే మందుబాబులు తక్కువ ధర అమలు కోసం వెయిట్‌ చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి