
ఏపీలో జనసేన జోరు చూపిస్తుంది. పవర్ స్టార్ సునామీ నడుస్తోంది. కూటమి క్లియర్ కట్ మెజార్టీ దిశగా దూసుకెళ్తుంది. అయితే పోటీ చేసిన అన్ని స్థానాల్లో జనసేన అభ్యర్థులు ముందజలో ఉన్నారు. అవును పోటీ చేసిన 21 చోట్ల.. జనసేన లీడ్‌లో ఉన్నట్లు తాజా రిపోర్ట్స్ చెబుతున్నాయి. కాగా పవన్ కల్యాణ్ పిఠాపురంలో 19 వేలకు పైచిలుకు మెజార్టీతో ముందుకు సాగుతున్నారు.
పవన్‌కు ఇది మామలు కమ్ బ్యాక్ కాదు. 2019 ఎన్నికల్లో జనసేన కేవలం ఒకే ఒక్క చోట గెలిచింది. పవన్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. అయినా.. పట్టు వదలని విక్రమార్కుడిలా ముందుగా సాగిన పవన్ కల్యాణ్.. ఈ ఎన్నికల్లో తన పవరేంటో చూపించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..