Andhra Pradesh: ఏపీ మంత్రివర్గ సమావేశం.. కీలక నిర్ణయాలివే
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో ఏపీ క్యాబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.
ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. పేపర్‌లెస్‌గా ఈ-క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. అజెండా మొదలుకొని నోట్స్ వరకు ప్రభుత్వం ఆన్‌లైన్‌లోనే మంత్రులకు అందజేసింది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ జరిగింది. మరోవైపు ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. క్యాబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…
- వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానం రద్దు. పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
- పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ ఫొటో తొలగింపు
- పోలవరం ఎడమ కాలువ పనుల పునరుద్ధరణకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్. ఈ పనుల్లో ప్రస్తుత కాంట్రాక్ట్ సంస్థనే కొనసాగించేందుకు నిర్ణయం
- ఆబ్కారీ శాఖ పునర్ వ్యవస్థీకరణకు పచ్చజెండా. తదనుగుణంగా స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్‌ఈబీ) రద్దుకు ఆమోదం
- వివాదాల్లోని భూముల రిజిస్ట్రేషన్ నిలిపివేతకు ఓకే చెప్పిన క్యాబినెట్
- సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు అంగీకారం
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..