ప్రధాని మోదీ మెచ్చిన మన నగరవనం.. ఏపీలోని ఈ పట్టణం గురించి మీకు తెలుసా..?

ప్రధాని మోదీ 'మన్ కీ బాత్'లో అనంతపురం జిల్లా రాయదుర్గం నగర వనాన్ని ప్రశంసించారు. ఎడారి వంటి ప్రాంతంలో నీటి ఎద్దడిని అధిగమించి, 175 ఎకరాల్లో ఈ వనాన్ని అభివృద్ధి చేశారు. జల సంరక్షణ పద్ధతులు, పచ్చదనం పెంపుతో ఇది ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతోంది. కేంద్ర నిధులతో పర్యావరణ పరిరక్షణకు, పచ్చదనం పెంపునకు ఇది ఒక గొప్ప ఉదాహరణ.

ప్రధాని మోదీ మెచ్చిన మన నగరవనం.. ఏపీలోని ఈ పట్టణం గురించి మీకు తెలుసా..?
Anantapur in Mann Ki Baat

Edited By:

Updated on: Jan 26, 2026 | 8:07 PM

ప్రధాని నోటి వెంట అనంతపురం జిల్లాలోని మారుమూల రాయదుర్గంలో నగర వనం పేరు ప్రస్తావన రావడంతో ఇప్పుడు అందరి దృష్టి రాయదుర్గం నగర వనం ఏంటి? ఎలా ఉంటుంది అనే దానిపై పడింది. ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడుతూ రాజస్థాన్ లాంటి ఎడారి ప్రాంతాలు ఉండే అనంతపురం జిల్లా రాయదుర్గంలో చెట్లను సంరక్షిస్తూ… నీటి ఎద్దడిని కూడా అధిగమించి… వనం ఏర్పాటు చేసుకున్నారని మన్‌కీ బాత్ లో ప్రధాని మోడీ ప్రస్తావించారు… ఎడారి, కొండ ప్రాంతాల్లో పెరిగే మొక్కలను తీసుకొచ్చి రాయదుర్గం చుట్టుపక్కల ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేసేందుకు ఫారెస్ట్ అధికారులు నగర వనం ఏర్పాటు చేశారు… ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో రాయదుర్గం నగర వనం ప్రస్తావన తీసుకురావడంతో… రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు నగర వనంను సందర్శించారు…

అనంతపురం జిల్లా రాయదుర్గం లో కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేసిన నగరవనం ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు సిద్ధమైంది.. అదుపు 175 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రకృతి వనాన్ని అభివృద్ధి చేశారు… రాయదుర్గం నగరవనం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రెండు కోట్ల రూపాయలు నిధులు కూడా ఇచ్చింది.. ఈ నిధులతో రాయదుర్గం పట్టణ వాసులకు పిల్లలకు ఉపయోగపడేలా నగర వనాన్ని తీర్చిదిద్దారు. చిన్నపిల్లలు ఆడుకునేందుకు ఆట వస్తువులు… యంత్రాలు ఏర్పాటు… అలాగే వనం అంతట పచ్చని మొక్కలను నాటారు.

అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే అనంతపురం లాంటి జిల్లాలో… నీటి ఎద్దడిని అధిగమించి… ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుని… అలాగే కొండ ప్రాంతాల్లో వేగంగా పెరిగే మొక్కలను నాటి… మొక్కల సంరక్షణ కోసం ప్రత్యేకంగా నీటి వసతిని కల్పించారు అటవీశాఖ అధికారులు… రాజస్థాన్ ఎడారి తర్వాత… దక్షిణ భారతదేశంలో ఎడారిగా పిలవబడే రాయదుర్గం నగరవనంపై ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు రాయదుర్గం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రామచంద్రుడు….

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

రాయదుర్గం నగరవనంలో జల సంరక్షణకు తీసుకున్న చర్యలపై… ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రశంసించడం… గర్వకారణంగా ఉందన్నారు రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు… 2014 2019 మధ్యకాలంలో రాయదుర్గం నగరవనం ఏర్పాటు చేయగా… 2019 అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం నగరవనాన్ని నిర్లక్ష్యం చేయడంతో…. భూగర్భ జలాలు అడుగంటి… పచ్చదనం కరువైపోయింది అన్నారు ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు… తిరిగి 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయదుర్గం నగర వనాన్ని అభివృద్ధి చేయడంతో పాటు… జల సంరక్షణకు… పర్యావరణ పరిరక్షణకు పనులను వేగవంతం చేశామన్నారు కాల్వ శ్రీనివాసులు… తాము చేసిన పనులని… ఇవాళ ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ ప్రజలతో పంచుకున్నారన్నారు ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు…

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..