Andhra: ముసలోడు మామూలోడు కాదు మావ.! అప్పుడే 35 ఏళ్ల క్రితం.. ఏం చేశాడో తెలిస్తే స్టన్

1992 డిసెంబర్ 28వ తేదీన APSRTCకు చెందిన AP 9Z 4105 బస్సు దోపిడీ జరిగింది. జల్లిపల్లి-కుడేరు మధ్య అర్ధరాత్రి మదనపల్లి డిపోకు చెందిన ఓ బస్సులోకి ముగ్గురు దొంగలు ఎక్కి డ్రైవర్‌ను, ప్రయాణికులను బెదిరించి వారి వద్ద ఉన్న నగదు, బంగారు ఆభరణాలు బలవంతంగా దోచుకుని బస్సు నుంచి దిగి పారిపోయారు.

Andhra: ముసలోడు మామూలోడు కాదు మావ.! అప్పుడే 35 ఏళ్ల క్రితం.. ఏం చేశాడో తెలిస్తే స్టన్
Andhra News

Edited By: Ravi Kiran

Updated on: Dec 02, 2025 | 12:39 PM

తప్పు చేసిన వారిని చట్టం ఎప్పటికయినా వదలదు. తప్పుడు పనులు చేసి తప్పించుకోవాలని చూస్తే ఎప్పటికైనా కటకటాల పాలు కాక తప్పదన్న విషయం మరోసారి రుజువయింది. 35 సంవత్సరాల క్రితం చేసిన ఓ బస్సు దోపిడీ జరగ్గా.. ఆ కేసు నిందితుడిని దాదాపుగా 64 సంవత్సరాల వయసులో కటకటాల పాలు చేసింది. అనంతపురం జిల్లా కుడేరు పోలీస్ స్టేషన్ పరిధిలో 1992 డిసెంబర్ 28వ తేదీన APSRTCకు చెందిన AP 9Z 4105 బస్సు దోపిడీ జరిగింది. జల్లిపల్లి-కుడేరు మధ్య అర్ధరాత్రి మదనపల్లి డిపోకు చెందిన ఓ బస్సులోకి ముగ్గురు దొంగలు ఎక్కి డ్రైవర్‌ను, ప్రయాణికులను బెదిరించి వారి వద్ద ఉన్న నగదు, బంగారు ఆభరణాలు బలవంతంగా దోచుకుని బస్సు నుంచి దిగి పారిపోయారు.

ఈ దోపిడీ ఘటనలో గడ్డం చలపతి అనే వ్యక్తి ఫిర్యాదు ఆధారంగా క్రైమ్ నెంబర్ 82/1992_U/S 392 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తర్వాత 1993, ఏప్రిల్ 7న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు. తర్వాత 1993, జూన్ 11న చట్ట ప్రకారం బెయిల్ పై విడుదల అయిన తర్వాత కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా.. నియమ నిబంధనలు పాటించకుండా అప్పటి నుండి ఇప్పటి వరకు పోలీసుల కళ్ళు కప్పి కనిపించకుండా పరారయ్యాడు. పోలీసు విచారణలో కుటుంబ సభ్యులకు, గ్రామ ప్రజలకు కూడా సమాచారం తెలియకపోవడంతో బస్సు దోపిడి నిందితుడు నరసింహులుపై జారీ అయిన నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. పెండింగ్ కేసుల విచారణలో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టిన కూడేరు సీఐ రాజు, సిబ్బంది ఎట్టకేలకు కర్ణాటక రాష్ట్రం తుముకూరు జిల్లాకు చెందిన ఏ3 నిందితుడు బోయ నరసింహులు( 64) ప్రస్తుతం కొత్తపల్లి గ్రామంలో నివాసం ఉంటున్నట్లు గుర్తించి.. పోలీసులు అతడిని అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు. అందుకే అంటారు ఖానూన్ కా హాత్ బహుత్ లంబా హై అని.. అంటే చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని అర్ధం.