ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ యువ నేతలు వంగవీటి రాధాకృష్ణ, పరిటాల శ్రీరామ్ భేటీ కావడం రాజకీయంగా ఆసక్తిని రేకెత్తించింది. ఆదివారం రాత్రి ఈ ఇద్దరు యువ నేతలు రాజమహేంద్ర వరంలో భేటీ కావడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఏపీలో వీరిద్దరి కుటుంబాలకు బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న విషయం తెలిసిందే.
అమరావతి రైతుల మహాపాదయాత్ర సోమవారం రాజమహేద్రవరంలోకి ప్రవేశించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ ఇరువురు నేతలు యాత్రకు మద్దతు తెలపనున్నారు. ఈ క్రమంలోనే పాదయాత్రలో పాల్గొనేందుకు రాజమహేంద్రవరం వచ్చిన రాధా, శ్రీరామ్‌లు మరో యువనేత జీఎంసీ బాలయోగి తనయుడు హరీశ్‌తో కలిసి సమావేశమయ్యారు.
రాజమండ్రి నగరంలో వంగవీటి రాధా గారితో సమావేశమైన సందర్భంగా… pic.twitter.com/OoJlwLYt9l
— Paritala Sreeram (@IParitalaSriram) October 16, 2022
ఇదిలా ఉంటే గతంలో వంగవీటి రాధకు పరిటాల శ్రీరామ్ మద్ధతుగా నిలిచిన విషయం తెలిసిందే. రాధాపై రెక్కీ జరిగిందన్న వార్తల నేపథ్యంలో శ్రీరామ్ తీవ్రంగా స్పందించారు. రాధాను ఎవరైనా టచ్ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచనలం సృష్టించిన విషయం తెలిసిందే.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..