Andhra Pradesh: కుంగుతున్న రోడ్లు.. ఒక్కసారిగా గుంతలో పడిన ఆటో.. తప్పిన పెను ప్రమాదం

జంగారెడ్డి గూడెం గాంధీబొమ్మ సెంటర్‌లోని మురుగునీటి కాలువమీదుగా వేసిన రోడ్డు బీటలు వారింది. ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎన్నోసార్లు అధికారులకు మొరపెట్టుకున్నారు. ఎవరూ పట్టించుకోలేదు.

Andhra Pradesh: కుంగుతున్న రోడ్లు.. ఒక్కసారిగా గుంతలో పడిన ఆటో.. తప్పిన పెను ప్రమాదం
Pothole In Road

Updated on: Apr 09, 2023 | 11:39 AM

తెలుగు రాష్ట్రాల్లో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా మారుతోంది. ఇటీవల ఉన్నట్టుండి రోడ్లు కుంగిపోతున్నాయి. రహదారిలో వాహనాలు ప్రయాణిస్తున్న సమయంలోనే ఒక్కసారిగా భూమిలోకి రోడ్లు కుంగిపోయి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. నగరం, పట్టణం, పల్లె తేడా లేకుండా ఎక్కడ చూసిన ఇదే పరిస్థితి. తాజాగా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం గాంధీ బొమ్మ సెంటర్ సమీపంలో ఒక్కసారిగా రహదారి కుంగిపోయింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఆటో బోల్తాకొట్టి డ్రైనేజీలో పడిపోయింది.

జంగారెడ్డి గూడెం గాంధీబొమ్మ సెంటర్‌లోని మురుగునీటి కాలువమీదుగా వేసిన రోడ్డు బీటలు వారింది. ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎన్నోసార్లు అధికారులకు మొరపెట్టుకున్నారు. ఎవరూ పట్టించుకోలేదు. ఇంతలో జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. అదే సమయంలో లోడుతో వెళ్తున్న ట్రాలీ ఆటో ఒక్కసారిగా గుంతలో పడిపోయింది. అయితే ఆటోలో ఉన్నవారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. దాంతో అందరూ ఊపిరి తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us