దోశ, పూరి, గరం.. గరం.. ఛాయ్.. సత్తెనపల్లి వారికి మాత్రమే.! అంబటి అంటే ఆమాత్రం ఉంటది..

| Edited By: Ravi Kiran

Feb 28, 2024 | 4:32 PM

సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా రాలే.. వచ్చే నెలలో వచ్చేస్తుందని ఇప్పటి నుంచి హడావుడి చేస్తున్నారు. నోటిఫికేషన్ కంటే ముందే రాజకీయ నేతలు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య పోటా పోటీ నెలకొంది.

దోశ, పూరి, గరం.. గరం.. ఛాయ్.. సత్తెనపల్లి వారికి మాత్రమే.! అంబటి అంటే ఆమాత్రం ఉంటది..
Ambati Rambabu
Follow us on

సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా రాలే.. వచ్చే నెలలో వచ్చేస్తుందని ఇప్పటి నుంచి హడావుడి చేస్తున్నారు. నోటిఫికేషన్ కంటే ముందే రాజకీయ నేతలు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య పోటా పోటీ నెలకొంది. దీంతో నేతలు ఇప్పటి నుంచే ఓటర్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.

సత్తెనపల్లిలో మరోసారి పోటీ చేసేందుకు అంబటి సిద్దమయ్యారు. రాష్ట్ర రాజకీయాల్లో ఆయన పేరు తెలియని వారుండరు. వాయిస్ ఆఫ్ జగన్‌గా పేరుగాంచిన అంబటి అప్పడే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రతిరోజూ ప్రజల మధ్యలో ఉండేలా ప్రణాళిక రూపొందించారు. రాత్రి వేళల్లో పల్లెటూళ్లలో పర్యటిస్తున్న మంత్రి తెల్లవారుజామున నుంచి సత్తెనపల్లి పట్టణంలో పర్యటిస్తున్నారు. మొన్న ఆ మధ్య బుల్లెట్ బైక్‌పై సర్రుమంటూ దూసుకుపోయిన అంబటి ఈ రోజు సరికొత్త అవతారం ఎత్తారు. ప్రచారంలో భాగంగా హోటల్ వద్దకు వెళ్లిన ఆయన దోశలు వేశారు. అనంతరం వేడి వేడి పూరిలు వేసి కార్యకర్తలకు, అభిమానులకు తినిపించారు. అంతటితో ఆగలేదు.. పక్కనే ఉన్న టీ స్టాల్‌లో గరమ్ గరమ్ ఛాయ్ కూడా పెట్టారు. తాను పెట్టిన టీని అభిమానులు అందరికీ అందించారు. పొద్దు పొద్దున్నే మంత్రి ఏకంగా టిఫిన్, టీ స్టాల్‌కు రావడంతో పాటు వేడి వేడిగా వండి వడ్డించడంతో అభిమానులు ఖుషి అయ్యారు.

అంతేకాదు టిఫిన్ తిని టీ తాగిన అనుచరులు, అభిమానులు అంబటి చేతి వంట బాగానే ఉందంటూ ప్రసంసిస్తున్నారు. రాజకీయ ప్రత్యర్ధులపై విరుచుకుపడే రాంబాబు మాటల్లోనే కాదు చేతల్లోనూ పనితనం చూపించారంటున్నారు ఆయన అభిమానులు. ఇప్పుడే ఇంత హడావుడి అయితే రానున్న రోజుల్లో ఇంకెన్ని చిత్రాలు చూడాలో అని ఓటరు మహాశయుడు అంటున్నాడు. అంబటి గుంటూరు జిల్లాలో సీనియర్ అయినా.. కన్నాతో పోటీ పడుతున్నారు. దీంతో ఇద్దరి మధ్య బిగ్ ఫైట్ నడుస్తోంది. దీంతో ఓటర్ దృష్టిలో పడి నాలుగు ఓట్లు సంపాదించుకునేందుకు విచిత్ర ప్రచారాలకు తెరదీశారు. మాటల్లోనే కాదు ప్రచారంలోనూ అంబటి మార్క్ కనిపిస్తుండటంతో అభిమానుల ఆనందానికి అంతే లేకుండా పోతుంది. మరి గెలుపు మాటేమిటీ అంటే అది తెలియాలంటే రెండు నెలలు ఆగాల్సిందేనంటున్నారు.