Jogi Ramesh : వెన్నుపోటుదారుల సంఘానికి అధ్యక్షుడు చంద్రబాబు అయితే, ఉపాధ్యక్షుడు.. రఘురామ కృష్ణరాజు : అసెంబ్లీలో జోగి రమేష్

YCP MLA Jogi Ramesh slams RRR : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా కృష్ణాజిల్లా పెడన శాసనసభ్యుడు జోగి రమేష్..

Jogi Ramesh : వెన్నుపోటుదారుల సంఘానికి అధ్యక్షుడు చంద్రబాబు అయితే,  ఉపాధ్యక్షుడు.. రఘురామ కృష్ణరాజు : అసెంబ్లీలో జోగి రమేష్
Mla Jogi Ramesh On RRR

Updated on: May 20, 2021 | 8:03 PM

YCP MLA Jogi Ramesh slams RRR : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా కృష్ణాజిల్లా పెడన శాసనసభ్యుడు జోగి రమేష్.. వైసీపీ నర్సాపురం ఎంపి రఘురామకృష్ణరాజుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెన్నుపోటుదారుల సంఘానికి అధ్యక్షుడు చంద్రబాబు అయితే.. ఉపాధ్యక్షుడు రఘురామ కృష్ణరాజు అని ఆయన శాసనసభలో వ్యాఖ్యానించారు. వైసీపీ పార్టీ గుర్తు, వైయస్ జగన్ ఫోటోతో రఘురామకృష్ణరాజు గెలిచారని ఆయన అన్నారు. రఘురామరాజు ఎంపి పదవీకి రాజీనామా చేస్తే వార్డ్ మెంబర్ గా కూడా గెలవలేరని జోగి రమేష్ అసెంబ్లీ సాక్షిగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రఘురామరాజు ఒక దుర్మార్గుడన్న జోగి.. అసెంబ్లీలో ఇలాంటి మాటలు.. మాట్లాడకూడదని.. కానీ రఘురామకృష్ణరాజు చేసిన పనికి మాటలు ఆగటం లేదన్నారాయన. తాను ఏమైనా తప్పు మాట్లాడితే రికార్డుల నుంచి తొలగించాలని జోగి రమేష్ సభాపతికి విన్నవించారు.

Read also : GHMC fever survey : గ్రేటర్ హైదరాబాద్ లోని పదిహేనున్నర లక్షల ఇళ్లలో కొవిడ్ ఫివర్ సర్వే పూర్తి