ఉప్పునీటి ‘శాపం’ తీరి మంచినీరెలా.. ఇజ్రాయెల్‌లో జగన్ డౌట్

| Edited By:

Aug 05, 2019 | 10:23 AM

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇజ్రాయెల్ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఓ వైపు కుటుంబంతో సరదాగా గడుపుతూనే.. మరోవైపు రాష్ట్ర సంక్షేమం కోసం ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఇజ్రాయెల్‌లోని హెడ్రాలో ఉన్న ఉప్పునీటి నుంచి మంచినీరు తయారు చేసే కేంద్రం(H21D డీశాలినేషన్ ప్లాంట్‌)ను సందర్శించారు. ప్లాంట్‌లో ఉప్పు నీరును మంచి నీరుగా మార్చే పద్దతిని గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత ప్లాంట్ ఏర్పాటు, ఎలా పనిచేస్తుంది అన్న వివరాలపై అక్కడి […]

ఉప్పునీటి ‘శాపం’ తీరి మంచినీరెలా.. ఇజ్రాయెల్‌లో జగన్ డౌట్
Follow us on

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇజ్రాయెల్ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఓ వైపు కుటుంబంతో సరదాగా గడుపుతూనే.. మరోవైపు రాష్ట్ర సంక్షేమం కోసం ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఇజ్రాయెల్‌లోని హెడ్రాలో ఉన్న ఉప్పునీటి నుంచి మంచినీరు తయారు చేసే కేంద్రం(H21D డీశాలినేషన్ ప్లాంట్‌)ను సందర్శించారు. ప్లాంట్‌లో ఉప్పు నీరును మంచి నీరుగా మార్చే పద్దతిని గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత ప్లాంట్ ఏర్పాటు, ఎలా పనిచేస్తుంది అన్న వివరాలపై అక్కడి వారు జగన్‌కు డెమో ఇచ్చారు.

కాగా ఇలాంటి మోడల్‌ను రాయలసీమ వంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే నీటి కష్టాలు తీరే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ పర్యటనలో ఆయనతో పాటు టెల్ అవీవ్‌లోని డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఇండియన్ ఇరిగేషన్ మిషన్ షెరింగ్ కూడా ఉన్నారు. కాగా జగన్ ఇజ్రాయెల్ పర్యటన ఆదివారంతో ముగిసింది. అక్కడి నుంచి బయల్దేరిన ఆయన ఇవాళ రాష్ట్రానికి చేరుకోనున్నారు.

https://twitter.com/ahvrofficial/status/1157985256961536001