జూన్ 8న ఏపీ మంత్రుల ప్రమాణస్వీకారం.. రేస్‌లో ఉన్నవారెవరంటే..?

| Edited By:

Jun 01, 2019 | 11:31 AM

ఏపీ ముఖ్యమంత్రిగా గురవారం బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో వేగాన్ని పెంచారు. ఈ నేపథ్యంలో తన కేబినేట్‌పై కసరత్తులు చేస్తోన్న జగన్.. కొత్త మంత్రుల చేత ఈ నెల 8న ప్రమాణస్వీకారం చేయించనున్నారు. అనంతరం వారిచే మొదటి కేబినెట్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. అలాగే అదే రోజున ఉ.8.39గంటలకు జగన్ ఏపీ సచివాలయంలోకి ప్రవేశించనున్నారు. కాగా మరోవైపు జగన్ కేబినెట్‌లో స్థానం దక్కించుకునేందుకు పలువురు ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. వారిలో బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, […]

జూన్ 8న ఏపీ మంత్రుల ప్రమాణస్వీకారం.. రేస్‌లో ఉన్నవారెవరంటే..?
Follow us on

ఏపీ ముఖ్యమంత్రిగా గురవారం బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో వేగాన్ని పెంచారు. ఈ నేపథ్యంలో తన కేబినేట్‌పై కసరత్తులు చేస్తోన్న జగన్.. కొత్త మంత్రుల చేత ఈ నెల 8న ప్రమాణస్వీకారం చేయించనున్నారు. అనంతరం వారిచే మొదటి కేబినెట్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. అలాగే అదే రోజున ఉ.8.39గంటలకు జగన్ ఏపీ సచివాలయంలోకి ప్రవేశించనున్నారు. కాగా మరోవైపు జగన్ కేబినెట్‌లో స్థానం దక్కించుకునేందుకు పలువురు ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. వారిలో బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, ముత్యాలనాయుడు, పిల్లి సుభాష్ చంద్రబోస్, విశ్వరూప్, గ్రంథి శ్రీనివాస్, ప్రసాదరాజు, కొడాలి నాని, పేర్ని నాని, ఆళ్ల రామకృష్ణారెడ్డి, సుచరిత, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మేకపాటి గౌతమ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అంజాద్ బాషా, బుగ్గన, అనంత వెంకటరామిరెడ్డి తదితరులు ఉన్నట్లు సమాచారం.