మీకు ఎలా కావాలో చెప్పండి.. మా యువతను అలా తీర్చిదిద్దుతాం
ఏపీలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలున్నాయని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. విజయవాడలో డిప్లొమాటిక్ సదస్సును ప్రారంభించిన ఆయన.. రాష్ట్రంలో ఈ సదస్సు జరగడం సంతోషంగా ఉందని.. దీని నిర్వహణకు సహకరించిన కేంద్రానికి ధన్యవాదాలని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రానికి వస్తున్న మెజార్టీ ఆదాయం పరిశ్రమలదేనని అన్నారు. 75శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలని చట్టం తెచ్చామని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం విన్ విన్ పాలసీ అనుసరిస్తుందని.. ఉపాధి, ఉద్యోగాల కోసం తమ రాష్ట్రంలో […]
ఏపీలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలున్నాయని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. విజయవాడలో డిప్లొమాటిక్ సదస్సును ప్రారంభించిన ఆయన.. రాష్ట్రంలో ఈ సదస్సు జరగడం సంతోషంగా ఉందని.. దీని నిర్వహణకు సహకరించిన కేంద్రానికి ధన్యవాదాలని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రానికి వస్తున్న మెజార్టీ ఆదాయం పరిశ్రమలదేనని అన్నారు. 75శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలని చట్టం తెచ్చామని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం విన్ విన్ పాలసీ అనుసరిస్తుందని.. ఉపాధి, ఉద్యోగాల కోసం తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తున్నామని కోరుతున్నామని ఆయన అన్నారు.
ఏ నైపుణ్యం, ఏం విద్యార్హత కావాలో చెబితే.. ఆ దిశగా తమ యువతను తీర్చిదిద్దుతామని జగన్ అన్నారు. ఏపీలో 4 ఓడరేవులు, 6ఎయిర్‌పోర్టులు ఉన్నాయని.. మరో నాలుగు పోర్ట్‌లను ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. ఇక ఆక్వా ఉత్పత్తుల్లోనూ ఏపీ ముందుందని.. అంతర్జాతీయ ప్రమాణాలతో వ్యవసాయం చేస్తున్నామని జగన్ తెలిపారు. పరిశ్రమలు, జలవనరుల్లో పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. విశాఖ, విజయవాడ, గుంటూరులో మెట్రో రైలు రావాలని.. ఎలక్ట్రిక్ బస్సులు, ఫుడ్ ప్రాసెసింగ్‌లో పెట్టుబడులు కావాలని జగన్ పెట్టుబడిదారులను కోరారు.