Kolusu Parthasarathy: జగన్ దెబ్బకు చంద్రబాబు మతిభ్రమించి ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నారు: కొలుసు పార్థసారధి

|

Aug 27, 2021 | 7:50 PM

సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల్లో చావుదెబ్బ తిన్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మతిభ్రమించి ఉన్మాదిలా

Kolusu Parthasarathy: జగన్ దెబ్బకు చంద్రబాబు మతిభ్రమించి ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నారు: కొలుసు పార్థసారధి
Kolusu Parthasaradhi On Cha
Follow us on

Kolusu Parthasarathy – CM Jagan: సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల్లో చావుదెబ్బ తిన్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మతిభ్రమించి ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నాడని వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి వ్యాఖ్యానించారు. అధికారం కోల్పోయిన తరువాత ఏపీ రాష్ట్రాన్ని, ప్రజలను వదిలి హైదరాబాద్‌కు పారిపోయిన చంద్రబాబు.. జూమ్‌ యాప్‌ ద్వారా కాలం వెల్లదీస్తున్నాడని కొలుసు విమర్శించారు.

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో కొలుసు పార్థసారధి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్‌ చార్జీలు తగ్గించాలని బషీర్‌బాగ్‌లో చేపట్టిన రైతులపై పోలీసులతో చంద్రబాబు కాల్పులు జరిపించి రేపటికి 21 సంవత్సరాలు అని గుర్తుచేశారు. మొదటి నుంచీ చంద్రబాబు రైతు వ్యతిరేకిగా, ప్రజా వ్యతిరేకిగానే ఆలోచన చేశాడని, ప్రజలకు మేలు జరుగుతుంటే జీర్ణించుకోలేరని మండిపడ్డారు.

బషీర్‌బాగ్‌లో ఆ రోజు పోలీసులతో రైతుల కాల్పులు జరిపించిన ఘటన ఈ రోజుకీ రైతులు మర్చిపోలేదన్నారు కొలుసు పార్థసారధి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశానని జబ్బలు చరుచుకుంటూ గొప్పలు చెప్పుకునే చంద్రబాబు.. రాష్ట్రంలో ప్రజలకు ఇంత మేలు జరుగుతుంటే చూసి ఓర్వలేకపోతున్నారని ఆరోపించారు. తనకున్న టక్కుటమారాలతో కేంద్రానికి కంప్లయింట్‌ చేస్తున్నాడని కొలుసు ఆరోపించారు. తన లాయర్లతో ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను నిలిపివేయాలని కోర్టులో కేసు వేయించే దుస్థితికి, దౌర్భాగ్యానికి చంద్రబాబు దిగజారిపోయాడంటూ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్ చేశారు.

చంద్రబాబు తీరు రాష్ట్ర ప్రజలకు శాపంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గొప్ప కార్యక్రమాలను ప్రపంచంలోని మేధావులు మెచ్చుకుంటున్నారన్న కొలుసు.. వాటిని ఏ విధంగా అడ్డుకోవాలి, ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టి ప్రజలకు మేలు జరగకుండా అడ్డుకోవాలని ఆలోచన చేస్తున్న నీచుడు చంద్రబాబు అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అంతేకాదు, బహుశా రాజకీయాల్లో ఇలాంటి నీచ మనస్తత్వం ఉన్నవారు ఎవరూ ఉండరేమో అంటూ కొలుసు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read also: Rajahmundary: రాజమండ్రికి ఇక మహర్ధశ.. రాష్ట్రంలోనే ముఖ్య నగరంగా తీర్చిదిద్దుతామన్న టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి