సీఎం జగన్‌తో వల్లభనేని వంశీ భేటీ

అమరావతి: సీఎం జగన్‌తో గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భేటీ అయ్యారు. పోలవరం కుడి కాలువ నుంచి నీటి మళ్లింపునకు విద్యుత్‌ సరఫరాను పునరుద్దరించాలని సీఎంను వంశీ కోరారు. ఇప్పటికే ఇదే విషయాన్ని గురించి సీఎంకు లేఖ రాసిన వంశీ.. తాజాగా ఆయనతో భేటీ అయ్యారు. పోలవరం కుడికాల్వ నుంచి గోదావరి జలాల్ని గన్నవరం నియోజకవర్గంలోని మెట్ట గ్రామాలకు సాగు, త్రాగు నీటీ కోసం తరలించేందుకు సహకరించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. గత నాలుగేళ్లుగా సొంత […]

సీఎం జగన్‌తో వల్లభనేని వంశీ భేటీ

Edited By:

Updated on: Jul 11, 2019 | 7:07 PM

అమరావతి: సీఎం జగన్‌తో గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భేటీ అయ్యారు. పోలవరం కుడి కాలువ నుంచి నీటి మళ్లింపునకు విద్యుత్‌ సరఫరాను పునరుద్దరించాలని సీఎంను వంశీ కోరారు. ఇప్పటికే ఇదే విషయాన్ని గురించి సీఎంకు లేఖ రాసిన వంశీ.. తాజాగా ఆయనతో భేటీ అయ్యారు.

పోలవరం కుడికాల్వ నుంచి గోదావరి జలాల్ని గన్నవరం నియోజకవర్గంలోని మెట్ట గ్రామాలకు సాగు, త్రాగు నీటీ కోసం తరలించేందుకు సహకరించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. గత నాలుగేళ్లుగా సొంత ఖర్చులతో 500 మోటార్లు ఏర్పాటు చేసి నీటిని మళ్లించానని, దీనికి అవసరమయ్యే విద్యుత్తును గవర్నమెంట్ ఉచితంగా ఇచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని..పూర్వం లాగే విద్యుత్తు సరఫరా ఇచ్చేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని వంశీ కోరారు. వంశీ విజ్ఞప్తిపై జగన్‌ సానుకూలంగా స్పందించారు.

కాగా వల్లభనేని వంశీ ఎన్నిక చెల్లదంటూ గన్నవరం నియోజకవర్గ వైసీపీ యార్లగడ్డ అభ్యర్థి వెంకట్రావు హైకోర్టుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో వంశీ సీఎంను కలవడం చర్చనీయాంశమైంది