వైజాగ్‌లోని మెడ్‌టెక్ జోన్‌పై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంట్‌లో ప్రశంసలు గుప్పించారు. దేశ అవసరాలను తీర్చడంతోపాటు.. వైద్య పరికరాలను ఎగుమతి చేసే లక్ష్యంతో విశాఖలో ఏపీ మెడిటెక్ జోన్ ఏర్పాటైన విషయం తెలిసిందే.
‘‘మన దేశం ఏటా రూ. 50 వేల కోట్ల విలువైన వైద్య పరికరాలను దిగుమతి చేసుకునేది. ఈ పరిస్థితి విశాఖలోని మెడికల్ డివైజెస్ క్లస్టర్ కారణంగా మారింది. దేశంపై దిగుమతుల భారం తగ్గింది. ఎంఆర్ఐ యంత్రాలను దిగుమతి చేసుకోవడానికి రూ.4.5 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చేది. మనవాళ్లు రూ.98 లక్షలకే వాటిని రూపొందిస్తున్నారు. వాటి ఉత్పత్తి కోసం ఏపీ సీఎంకు ప్రతిపాదనలు పంపాం. ఈ క్లస్టర్‌తోపాటు మిగతా రాష్ట్రాల్లోనూ 5-6 మెడికల్ క్లస్టర్లను ఏర్పాటు చేసే దిశగా యోచిస్తున్నాం. వైజాగ్ క్లస్టర్ విస్తరణ కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి లేఖ రాశాం’’అని నితిన్ గడ్కరీ పార్లమెంట్‌లో ప్రసంగించారు.
మంత్రి మాట్లాడిన వీడియోను ట్వీట్ చేసిన మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.. కేంద్ర మంత్రికి ధన్యవాదాలు తెలిపాడు. ఏపీ మెడ్‌టెక్ జోన్ లాంటి అనువైన వాతావరణం, డాక్టర్ జితేందర్ సింగ్ శర్మ లాంటి హెల్త్ ఛాంపియన్లు దేశాన్ని హెల్త్ సూపర్ పవర్‌గా రూపొందించాలనే కలను సాకారం చేస్తున్నారంటూ వీరూ ప్రసంశలు గుప్పించాడు. ప్రధాని మోదీ, ఏపీ సీఎం, నితిన్ గడ్కరీలను ఆయన ట్యాగ్ చేశారు.<
Thank you Gadkari ji for this acknowledgement. Yes, with ecosystem like A.P. Med Tech Zone and health champions like Dr Jitendar Sharma, this dream of making India – a health superpower is possible@PMOIndia@AndhraPradeshCM@nitin_gadkari pic.twitter.com/18gmqiQCcA
— Virender Sehwag (@virendersehwag) July 30, 2019