ఒంగోలలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచార కేసులో నిందితులందరినీ కఠినంగా శిక్షించాలని టీడీపీ నేత పంచుమర్తి అనురాధ డిమాండ్ చేశారు. బాధితురాలికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి సామాజిక, ఆర్థిక భరోసా కల్పించాలన్నారు. జగన్ హయాంలో మహిళలకు రక్షణ కరువైందని విమర్శించారు. ఒక మైనర్ ముస్లిం బాలికకు జరిగిన అన్యాయం ఈ ప్రభుత్వానికి పట్టదా అని ప్రశ్నించారు. నిందితుల్లో సీఎం సామాజిక వర్గానికి చెందిన వాళ్లు కూడా ఉన్నారని..వారిని తప్పించే ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. హోం మంత్రి మహిళ అయి ఉండి కనీసం బాధితురాలిని పరామర్శించడానికి రాకపోవడం దారుణమన్నారు.