Sand supply in AP : ఏపీ సర్కారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న వైయస్ఆర్ – జగనన్న కాలనీలకు ఉచిత ఇసుక సరఫరా కోసం ప్రత్యేక కూపన్లు జారీ చేస్తున్నారు. ఈ మేరకు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాడేపల్లిలో తెలిపారు. ఇకపై జిల్లాల వారీగా ఔట్‌సోర్సింగ్ ద్వారా సీనరేజీ కనెక్షన్లు ఇవ్వనున్నామని మంత్రి చెప్పారు. వాల్యూమెట్రిక్ బదులు వెయిట్ బేసిన్‌లో సీనరేజ్ వసూళ్లకు ప్రణాళిక తీసుకొస్తున్నామన్నారు. జగనన్న కాలనీలకు ఉచిత ఇసుక కోసం ప్రత్యేక కూపన్లు అందిస్తున్నామని ఈ సందర్బంగా వెల్లడించారు. ఇసుక, మినరల్ కన్సెషన్ అప్లికేషన్లు, మైనింగ్‌పై సంబంధిత అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి ఇవాళ సమీక్షా సమావేశం నిర్వహించారు.
మైనర్ మినరల్స్ లీజులను ఈ–ఆక్షన్ ద్వారా కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నామని… శాస్త్రీయ విధానంలో మైనింగ్ లీజుల పెంపుదలకు యోచన చేస్తున్నట్టు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు.
Read also : AP JUDA’s : తీపి కబురు : ఏపీ సర్కార్‌తో చర్చలు సఫలం.. జూడాల సమ్మె విరమణ
YS Sharmila: వైయస్ షర్మిల పొలిటికల్ పార్టీ పై మరింత క్లారిటీ… పూర్తి వివరాలు