ఏపీ మహిళలకు గుడ్‌న్యూస్‌.. 25లక్షల మంది మహిళలకు ‘వైఎస్సార్ చేయూత’

| Edited By:

Jul 12, 2020 | 5:07 PM

ఏపీలో అర్హులైన మహిళలందరికీ వైఎస్సార్ చేయూత ద్వారా ఆర్థిక సాయం అందిస్తామని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను అన్నారు.

ఏపీ మహిళలకు గుడ్‌న్యూస్‌.. 25లక్షల మంది మహిళలకు వైఎస్సార్ చేయూత
Follow us on

ఏపీలో అర్హులైన మహిళలందరికీ వైఎస్సార్ చేయూత ద్వారా ఆర్థిక సాయం అందిస్తామని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను అన్నారు. ఆదివారం మాట్లాడిన ఆయన.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల్లో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి వైఎస్సార్ చేయూత ద్వారా లబ్ధి చేకూరుస్తామని వెల్లడించారు. ఈ పథకంలో భాగంగా 45 నుంచి 60 ఏళ్లలోపు మహిళలకు ఏడాదికి రూ.18,750 చొప్పున, నాలుగేళ్లలో రూ.75 వేలు ఆర్థిక సాయం చేస్తామని ఆయన అన్నారు. ఈ పథకం ద్వారా 25 లక్షల మంది మహిళలు లబ్ధి పొందనున్నారని ఆయన వివరించారు. ఈ క్రమంలో అర్హులైన పేద మహిళలను గుర్తించి వారికి ఆర్థికసాయం అందేలా చూడాలని సామినేని వాలంటీర్లకు సూచించారు. కాగా ఆగష్టు 12న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రారంభించనున్న విషయం తెలిసిందే.