పారదర్శకత, స్పష్టత ఉన్న సీఎం జగన్: సజ్జల‌

ప్రభుత్వ సలహాదారు హోదాను పదవిలా కాకుండా బాధ్యతగా స్వీకరిస్తానని కొత్తగా నియమితుడైన ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్టారెడ్డి తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ, వైసీసీ అధినేతగా ఉన్నా, సీఎంగా ఉన్నా జగన్ లో మార్పు లేదని ప్రశంసించారు. అధికార దర్పం లేని సీఎంను తొలిసారి చూస్తున్నామని, ఈ విషయాన్ని అధికారులు, ప్రజలు గమనించారని సజ్జల వివరించారు. సీఎం జగన్ లక్ష్యాలు నెరవేర్చేందుకు తన వంతు పాత్రను సమర్ధంగా నిర్వహిస్తానని సజ్జల స్పష్టం చేశారు. ప్రజల జీవితాలు మెరుగుపడాలన్న […]

పారదర్శకత, స్పష్టత ఉన్న సీఎం జగన్: సజ్జల‌

Edited By:

Updated on: Jun 19, 2019 | 7:09 PM

ప్రభుత్వ సలహాదారు హోదాను పదవిలా కాకుండా బాధ్యతగా స్వీకరిస్తానని కొత్తగా నియమితుడైన ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్టారెడ్డి తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ, వైసీసీ అధినేతగా ఉన్నా, సీఎంగా ఉన్నా జగన్ లో మార్పు లేదని ప్రశంసించారు. అధికార దర్పం లేని సీఎంను తొలిసారి చూస్తున్నామని, ఈ విషయాన్ని అధికారులు, ప్రజలు గమనించారని సజ్జల వివరించారు.

సీఎం జగన్ లక్ష్యాలు నెరవేర్చేందుకు తన వంతు పాత్రను సమర్ధంగా నిర్వహిస్తానని సజ్జల స్పష్టం చేశారు. ప్రజల జీవితాలు మెరుగుపడాలన్న విస్తృతమైన లక్ష్యం జగన్ కు ఉందని అన్నారు. దుబారా ఖర్చును తగ్గిస్తే ఏమైనా చేయొచ్చని నాడు సీఎంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిరూపించారని అన్నారు. పారదర్శకత, స్పష్టత ఉన్న సీఎం జగన్ కనుక అధికారులు కూడా ఉత్సాహంగా పనిచేస్తున్నారని చెప్పారు. సుదీర్ఘకాలం పాటు జర్నలిస్టుగా ఉన్న తాను, అనుకోని పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందని సజ్జల పేర్కొన్నారు.