కృష్ణానది తీరాన భారీ గొయ్యి కలకలం

|

Oct 19, 2020 | 5:45 PM

తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న కుండపోత వర్షాలకు వాగులు, చెరువులు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కృష్ణానదీ తీరాన భారీ గొయ్యి కలకలం రేపుతోంది.

కృష్ణానది తీరాన భారీ గొయ్యి కలకలం
Follow us on

తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న కుండపోత వర్షాలకు వాగులు, చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నదులు సముద్రాలుగా మారి గర్జిస్తున్నాయి. ముఖ్యంగా ఏపీ, తెలంగాణలో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చుతోంది. భారీగా వరదనీరు విజయవాడలోని ప్రకాశం బ్యారేజికి చేరుతుండటంతో 70గేట్లు ఎత్తి నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. 9లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చే అవకాశముండటంతో లంక గ్రామాలు, పల్లపు ప్రాంతాల వాసుల్ని ఖాళీ చేయించారు.

ఇటువంటి పరిస్థితుల్లో కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో కృష్ణానదీ తీరాన భారీ గొయ్యి కలకలం రేపుతోంది. ఇబ్రహీంపట్నం నుంచి ఫెర్రీకి వెళ్లే డబుల్ రోడ్‌లో నదీ తీరాన భారీ గొయ్యి ఏర్పడింది. లోపల నీరు ఊటగా ఊబికి వస్తుండటంతో వాహనదారులు, స్థానికులు హడలెత్తిపోతున్నారు. మరీ ముఖ్యంగా వాహనదారులు అజాగ్రత్తగా ఉంటే ప్రమాదం తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు. గొయ్యి పూడ్చేందుకు అధికారులు హుటాహుటినా సహాయక చర్యలుచేపట్టారు.