మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుకి హైకోర్టులో ఊరట

మాజీ మంత్రి, టీడీపీ నేత అయ్యన్నపాత్రుడికి హైకోర్టులో ఊరట లభించింది. అతడిపై నమోదైన నిర్భయ కేసులో అరెస్ట్‌పై న్యాయస్థానం స్టే ఇచ్చింది.

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుకి హైకోర్టులో ఊరట

Edited By:

Updated on: Jun 22, 2020 | 2:57 PM

మాజీ మంత్రి, టీడీపీ నేత అయ్యన్నపాత్రుడికి హైకోర్టులో ఊరట లభించింది. అతడిపై నమోదైన నిర్భయ కేసులో అరెస్ట్‌పై న్యాయస్థానం స్టే ఇచ్చింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

అయితే విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణిపై అయ్యన్నపాత్రుడు అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమె ఫిర్యాదుతో అయ్యన్న పాత్రుడుపై నిర్భయ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కోర్టును ఆశ్రయించిన అయ్యన్నపాత్రుడు అరెస్ట్‌ను నిలుపుదల చేయాలని కోరారు. ఈ క్రమంలో విచారణ జరిపిన న్యాయస్థానం.. అరెస్ట్‌పై స్టే విధించింది.

Read This Story Also: సుశాంత్ ఆత్మహత్య.. రియాపై పిటిషన్