Pawan Kalyan: ప్రధాని మోదీ ఓ “అనికేత్” అంటూ పవన్ కల్యాణ్‌ పోస్ట్.. దీని అర్థం ఏంటో తెలుసా?

ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ X లో ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. అందులో ఆయన మోదీని "అనికేత్‌"గా అభివర్ణించారు. అనికేత్ అంటే శివుడు, ఒక సంకల్పం అని వివరించారు. మోడీ సన్యాస జీవితం, దేశ సేవ, ఆవాస్ యోజన వంటి పథకాల ద్వారా కోట్లాది మందికి ఇళ్ళు కల్పించడం గురించి పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

Pawan Kalyan: ప్రధాని మోదీ ఓ అనికేత్ అంటూ పవన్ కల్యాణ్‌ పోస్ట్.. దీని అర్థం ఏంటో తెలుసా?
Pawan Post

Updated on: May 08, 2025 | 2:16 PM

ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ X లో ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. అ పోస్ట్‌ లో ఆయన ప్రధాని మోడీని “అనికేత్‌”గా అభివర్ణించారు. ‘‘అనికేత్ అంటే శివుడి పేరు, ఒక సంకల్పం అని ఆయన కొనియాడారు. తన సన్యాస జీవితంలో ప్రధాని మోదీ ‘అనికేత్’గా పిలువబడ్డారని పవన్ కల్యాణ్ రాసుకొచ్చారు. అనికేత్ అంటే ‘ఇల్లు లేకుండా జీవించే వారని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. ప్రపంచంలోని ప్రతి కణం వారి ఇల్లే అయినప్పటికీ వారికంటూ ఒక ప్రత్యేక స్థావరం ఉండదని పవన్ తెలిపారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, కామాఖ్య నుండి ద్వారక వరకు మొత్తం భారత్‌ను ప్రధాని తమ ఇల్లుగా భావించారని ఆయన పేర్కొన్నారు. తనకు ఇల్లు లేకపోయినా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన’ ద్వారా కోట్లాది మందికి సొంత ఇల్లు అందించిన ఘనత మోదీది అంటూ ఆయన చేసిన పోస్ట్‌లో పవన్ కల్యాణ్‌ రాసుకొచ్చారు.

మరోవైపు ఆపరేషన్ సిందూర్ విజయవంతంపై పవన్ కల్యాణ్ స్పందించారు. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి భారత్.. పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకుందని అన్నారు. భారత్ చేపట్టిన ఆపరేషన్‌ సింధూర్‌లో 30మందికి పైగా కీలక ఉగ్రవాదులు హతమయ్యారని అన్నారు. ఇది ప్రతి భారతీయుడు హర్షించదగ్గ విషయమంటూ పవన్‌కల్యాణ్ వివరించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో ధీటుగా బదులిచ్చామని… భారత్‌పై ఎవరు దాడి చేసినా సహించేదిలేదంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో అంతా దేశానికి అండగా ఉండాలి.. ప్రతి ఒక్కరూ మోదీకి మద్దతుగా నిలవాలంటూ కోరారు.

ఈ సందర్భంగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు కూడా పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. దేశానికి వ్యతిరేకంగా ఎవరూ పోస్టులు పెట్టొద్దు.. దేశ భద్రత విషయంలో.. ఇన్‌ఫ్లుయెన్సర్లు జాగ్రత్తగా మాట్లాడాలంటూ కోరారు. లేకపోతే చర్యలు తప్పవంటూ పేర్కొన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..