వైరల్‌ అవుతోన్న ఎన్నికల షెడ్యూల్‌.. స్పందించిన నిమ్మగడ్డ

హైకోర్టు ఉత్తర్వులతో నెలరోజుల క్రితం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ మళ్లీ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.

వైరల్‌ అవుతోన్న ఎన్నికల షెడ్యూల్‌.. స్పందించిన నిమ్మగడ్డ

Edited By:

Updated on: Sep 05, 2020 | 5:16 PM

Election Schedule AP: హైకోర్టు ఉత్తర్వులతో నెలరోజుల క్రితం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ మళ్లీ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ఇదేనంటూ ఓ షెడ్యూల్‌‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ స్పందించారు. కమిషన్ పేరుతో‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న షెడ్యూల్ తాము ప్రకటించింది కాదని ఆయన అన్నారు. ఎన్నికల కమిషన్ ఎలాంటి షెడ్యూల్ విడుదల చేయలేదని స్పష్టతను ఇచ్చారు. ఎవరో తప్పుడు సమాచారాన్ని ప్రచారాన్ని చేస్తున్నారని రమేష్ కుమార్ వెల్లడించారు.

Read More:

ప్రముఖ దర్శకనిర్మాత కన్నుమూత.. బాలీవుడ్‌లో మరో విషాదం

ఐపీఎల్‌ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌.. రేపు షెడ్యూల్‌ విడుదల