ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

| Edited By:

Aug 30, 2020 | 6:21 PM

గత కొద్ది రోజుల నుంచి ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల పాటు అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని...

ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు
Follow us on

గత కొద్ది రోజుల నుంచి ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల పాటు అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అమరావతి వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర, రాయల సీమలోని పలు ప్రాంతాల్లో చాలా చోట్ల మోస్తారు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు.

పశ్చిమ మధ్య ప్రదేశ్ దానిని ఆనుకుని ఉన్న తూర్పు రాజస్థాన్ ప్రాంతాల్లో అల్ప పీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 7.6 కిలో మీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపుకు వంపు తిరిగి ఉన్నది. దీని ప్రభావంతో ఇక ఏపీలోని ఉత్త‌ర కోస్తా, ద‌క్షిణ కోస్తా, రాయ‌ల సీమ ప్రాంతాల్లో వరుసగా మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే ప‌లు చోట్ల తీవ్రమైన గాలితో పాటు భారీ వర్షాలు కురుస్తాయ‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ అధికారులు వెల్ల‌డించారు.

Read More:

ఏపీలో కరోనా కల్లోలం.. ఒక్కరోజే 10 వేల కేసులు నమోదు

ఆసియాలో ఫస్ట్ టైం: కోవిడ్ రోగికి ఊపిరితిత్తుల మార్పిడి

ఇంకా డీప్‌ కోమాలోనే ప్రణబ్.. వెంటిలేటర్ మీద చికిత్స

బ్రేకింగ్: ఎంపీ అవినాష్ రెడ్డికి కరోనా పాజిటివ్

అన్నదాతలే మనకి గర్వకారణం.. ‘మన్‌కీ బాత్’లో ప్రధాని