ఏపీలో కరోనా కల్లోలం.. ఒక్కరోజే 10 వేల కేసులు నమోదు

ఏపీలో కరోనా వైరస్ కేసులు తీవ్ర‌త భారీగా పెరిగింది. అలాగే మ‌ర‌ణాల సంఖ్య కూడా బాగా పెరిగింది. తాజాగా గడిచిన 24 గంటల్లో భారీ 10,603 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. దీంతో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య..

ఏపీలో కరోనా కల్లోలం.. ఒక్కరోజే 10 వేల కేసులు నమోదు
Follow us

| Edited By:

Updated on: Aug 30, 2020 | 5:57 PM

Coronavirus Updates in AP: ఏపీలో కరోనా వైరస్ కేసులు తీవ్ర‌త భారీగా పెరిగింది. అలాగే మ‌ర‌ణాల సంఖ్య కూడా బాగా పెరిగింది. తాజాగా గడిచిన 24 గంటల్లో భారీ 10,603 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. దీంతో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 4,24,767కి చేరాయి. అలాగే 24 గంట‌ల్లో కొత్త‌గా 88 మంది మృతి చెందగా, ఇప్ప‌టివ‌ర‌కూ చ‌నిపోయిన‌ వారి సంఖ్య 3,884కి పెరిగింది. ఇక ప్రస్తుతం ఏపీలో 99,129 యాక్టివ్ కేసులు నమోదవ్వగా, 3,21,754 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కాగా ఏపీలో ఈ రోజు వరకూ 36,66,422 మందికి కరోనా పరీక్షలు నిర్వహించింది ప్రభుత్వం.

కాగా జిల్లాల వారీగా కొత్త కేసులుః అనంతపురంలో 694, చిత్తూరులో 948, తూర్పు గోదావరిలో 1090, గుంటూరులో 593, కడపలో 952, కృష్ణాలో 383, కర్నూలులో 811, నెల్లూరులో 1028, ప్రకాశంలో 881, శ్రీకాకుళంలో 819, విశాఖలో 866, విజయనగరంలో 558, పశ్చిమ గోదావరిలో 979 కేసులు నమోదయ్యాయి.

Read More:

ఆసియాలో ఫస్ట్ టైం: కోవిడ్ రోగికి ఊపిరితిత్తుల మార్పిడి

ఇంకా డీప్‌ కోమాలోనే ప్రణబ్.. వెంటిలేటర్ మీద చికిత్స

బ్రేకింగ్: ఎంపీ అవినాష్ రెడ్డికి కరోనా పాజిటివ్

అన్నదాతలే మనకి గర్వకారణం.. ‘మన్‌కీ బాత్’లో ప్రధాని