AP MLCs : సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన ఆ నలుగురు

|

Jun 21, 2021 | 8:40 PM

ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులుగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేసిన నలుగురు సభ్యులు సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.

AP MLCs : సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన ఆ నలుగురు
New Ycp Mlcs
Follow us on

Newly-elected YSRCP MLCs : ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులుగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేసిన నలుగురు సభ్యులు సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్‌కు వారంతా ధన్యవాదాలు తెలిపారు. సోమవారం ఉదయం గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా నియమితులైన నలుగురు వైసీపీ అభ్యర్థులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఎమ్మెల్సీ తోటత్రిమూర్తులు మీడియాతో మాట్లాడుతూ తన 25 ఏళ్ల రాజకీయ చరిత్రలో మొదటి సారి ఒక నాయకుడి ఆశీస్సులతో మండలి సభ్యుడిని అయినట్లు తెలిపారు. గత ఎన్నికల్లో జగన్ ఛరిష్మా ముందు గెలవలేక పోయానన్నారు. తమ సామాజిక వర్గానికి సహాయం చేయటానికి ముందు ఉంటానని స్పష్టం చేశారు.

మరో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మాట్లాడుతూ.. కడప జిల్లా నుంచి మొదటి బీసీ ఎమ్మెల్సీ‌గా జగన్ అవకాశం కల్పించారన్నారు. బీసీ అంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ బోన్ క్లాస్ అని నిరూపించిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని రమేష్ యాదవ్ అన్నారు. మరో ఇద్దరు ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మోషేన్‌రాజు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

కాగా, గుంటూరు జిల్లా అంకిరెడ్డిపాలేనికి చెందిన లేళ్ల అప్పిరెడ్డి సామాన్య రైతు కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. విద్యార్థి, యువజన, కార్మిక నేతగా ప్రజలకు దగ్గరయ్యారు. అనంతరం వైఎస్సార్‌సీపీలో చేరి వైస్‌ జగన్‌ అడుగుజాడల్లో అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారు.

మరో ఎమ్మెల్సీ మోషేన్‌రాజు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి. వైఎస్‌ జగన్‌ పార్టీని ప్రకటించిన మరుక్షణమే కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. వైఎస్‌ జగన్‌తో కలిసి ప్రజా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు.

Read also : Perni Nani : నారా లోకేష్‌కు జూనియర్ ఎన్టీఆర్ భయం పట్టుకుంది : మంత్రి పేర్ని నాని