అసెంబ్లీలో సీఎం జగన్ వ్యాఖ్యలపై ట్విట్టర్‌లో టీడీపీ నేత లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కాళేశ్వరం కడుతుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా అంటూ.. సీఎం జగన్ గారు సంస్కారవంతమైన భాషలో అసెంబ్లీలో అడిగారు. కాళేశ్వరంపై చంద్రబాబు ప్రభుత్వం.. కేంద్రానికి ఫిర్యాదు చేసిన విషయం అన్ని పత్రికల్లో వచ్చింది. ఇలాంటివి చూసే సమయం మీకు ఉండి ఉండదు. ఎందు కంటే.. ఆ టైంలో తమరు గుడ్డి గుర్రానికి పళ్లు తోముతున్నారేమో అని లోకేష్ ట్వీట్టర్‌లో ఎద్దేవాచేశారు.
కాగా… తెలంగాణపట్ల స్నేహభావంతో మెలగడం తప్పా అని ప్రతిపక్షాన్ని జగన్ నిలదీశారు. సీఎంల మధ్య సఖ్యత ఉండాల్సిన అవసరం ఉందని, తెలంగాణ నుంచి ఏపీకి గోదావరి నీరు ఇస్తున్నారని, నీళ్ల విషయంలోనూ రాజకీయాలు వెదుకుతున్నారని విమర్శించారు. ఇలాంటి దిక్కుమాలిన ప్రతిపక్షం ప్రపంచంలో ఎక్కడా ఉండదని జగన్ పేర్కొన్నారు.
అలాగే మిగతా పత్రికల్లో వచ్చిన వార్తలు కూడా చూడవచ్చు. ఆ టైంలో తమరు గుడ్డి గుర్రానికి పళ్ళు తోముతున్నారేమో, ఇలాంటివి చూసే టైం ఉండి ఉండదు. pic.twitter.com/nv1e9DtRx4
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) July 11, 2019