మెడలు వంచుతామని.. కేంద్రానికి సాష్టాంగ నమస్కారం చేశారు – లోకేష్

అమరావతి: కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇక ఈ బడ్జెట్‌పై చాలామంది రాజకీయ ప్రముఖల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. అటు బడ్జెట్‌లో రెండు తెలుగు రాష్ట్రాలకు ఈసారి కూడా కేంద్రం మొండి చెయ్యి చూపించింది. ఇది ఇలా ఉండగా కేంద్ర బడ్జెట్‌పై మాజీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి తీరని అన్యాయం జరిగిందని మండిపడ్డారు. ‘కేసుల మాఫీ కోసం సాష్టాంగ నమస్కారం […]

మెడలు వంచుతామని.. కేంద్రానికి సాష్టాంగ నమస్కారం చేశారు - లోకేష్
Follow us

|

Updated on: Jul 06, 2019 | 2:37 AM

అమరావతి: కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇక ఈ బడ్జెట్‌పై చాలామంది రాజకీయ ప్రముఖల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. అటు బడ్జెట్‌లో రెండు తెలుగు రాష్ట్రాలకు ఈసారి కూడా కేంద్రం మొండి చెయ్యి చూపించింది.

ఇది ఇలా ఉండగా కేంద్ర బడ్జెట్‌పై మాజీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి తీరని అన్యాయం జరిగిందని మండిపడ్డారు. ‘కేసుల మాఫీ కోసం సాష్టాంగ నమస్కారం చేశారని.. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హక్కులు గాలికి వదిలేశారన్నారు. 25 ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతామన్న జగన్ గారు… కేంద్రం ముందు సాష్టాంగపడి ఏపీ ప్రజల మెడలు వంచారు. మీకు 22 ఎంపీలను ఇచ్చినందుకు కేంద్రం నుంచి జీరో బేస్డ్ నేచురల్ బడ్జెట్ సాధించారు జగన్ గారు’ అని లోకేష్ ట్వీట్ చేశారు