కేబినెట్ హోదా దక్కించుకున్న’నందమూరి’.. అధికారిక ఉత్తర్వులు

| Edited By:

Nov 14, 2019 | 10:11 AM

ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్‌గా నందమూరి లక్ష్మీపార్వతికి కేబినెట్ హోదా కల్పిస్తూ జగన్ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రికి కల్పించే సౌకర్యాలతో పాటు జీతభత్యాలు, ఆమెకు సంబంధించిన ఇతర అలవెన్సులను ఉన్నత విద్యాశాఖ చెల్లించబోతోంది. ఇక ఈ పదవిలో లక్ష్మీపార్వతి రెండేళ్లపాటు కొనసాగనున్నారు. కాగా కొద్దిరోజుల క్రితమే ఏపీ తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్‌గా లక్ష్మీపార్వతిని నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ అధికారిక ఉత్తర్వులు […]

కేబినెట్ హోదా దక్కించుకున్ననందమూరి.. అధికారిక ఉత్తర్వులు
Follow us on

ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్‌గా నందమూరి లక్ష్మీపార్వతికి కేబినెట్ హోదా కల్పిస్తూ జగన్ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రికి కల్పించే సౌకర్యాలతో పాటు జీతభత్యాలు, ఆమెకు సంబంధించిన ఇతర అలవెన్సులను ఉన్నత విద్యాశాఖ చెల్లించబోతోంది. ఇక ఈ పదవిలో లక్ష్మీపార్వతి రెండేళ్లపాటు కొనసాగనున్నారు.

కాగా కొద్దిరోజుల క్రితమే ఏపీ తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్‌గా లక్ష్మీపార్వతిని నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఇక తాజాగా ఆమెకు కేబినెట్ హోదా కూడా లభించింది. లక్ష్మీ పార్వతితో పాటు గల్ఫ్ దేశాల్లో ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన జుల్ఫీకి కూడా కేబినెట్ హోదా లభించింది. అయితే జగన్ పార్టీ పెట్టిన కొన్ని రోజులకు వైసీపీలో చేరిన లక్ష్మీపార్వతి.. అప్పటి నుంచి ఆ పార్టీలో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. టీడీపీ నేతలపై ఎదురుదాడి చేస్తూ.. ముఖ్యంగా చంద్రబాబును టార్గెట్ చేస్తూ ఆమె వార్తల్లో నిలిచారు. మరోవైపు కొన్నేళ్లుగా తనతోనే ఉంటూ.. తనకు మద్దతు ఇచ్చిన వారికి ముఖ్య పదవులను కట్టుబెడుతూ వస్తున్నారు జగన్. ఈ క్రమంలో వైసీపీ మహిళా విభాగంలో ముఖ్యులుగా ఉన్న రోజా, వాసిరెడ్డి పద్మలకు జగన్ కీలక పదవులు ఇచ్చిన విషయం తెలిసిందే.